Janhvi Kapoor: దాని కోసం ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు.? జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవీ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార జాన్వీ కపూర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 22 July 2024 6:01 PM IST
Actress Janhvi Kapoor Interesting Comments About Social Media Trolling
X

Janhvi Kapoor: దాని కోసం ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు.? జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవీ నట వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార జాన్వీ కపూర్. నట వారసత్వం ఉన్నా తొలి సినిమాలో 'సైరత్‌'తో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఫస్ట్‌ మూవీతోనే తనలోని నటనను బయటపెట్టిందీ చిన్నది. ఇక ఆ తర్వాత ఇమేజ్‌కు దూరంగా ఉంటూనే నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చింది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ డోస్‌తో కుర్రాళ్లను కట్టిపడేసే ఈ చిన్నది సినిమాల్లో మాత్రం గ్లామర్‌ పాత్రలకూ దూరంగా ఉంటూ వస్తోంది.

ఇదిలా ఉంటే జాన్వీకి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నట్లుగానే, విమర్శలు సైతం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్టార్‌ కిడ్‌ కోణంలో జాన్వీ ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న నెగిటివ్‌ కామెంట్స్‌పై జాన్వీ ఓపెన్‌ అయ్యారు. ప్రస్తుతం ఉలఘ్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిన్నది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ సర్వసాధారణంగా మారిపోయిందన్న జాన్వీ.. వాటి గురించి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

పబ్లిక్‌ ఫిగర్‌ అయినా, కాకపోయినా సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ ఎదుర్కోవడం నిరంతరం జరుగుతూనే ఉంటాయని, ఆ కామెంట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయమై జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. 'ఒక విషయంలో ఈరోజు పొగిడిన వాళ్లే, అదే విషయంపై రేపు తిడతారు. ముక్కూ, మొఖం తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు. మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి' అని తేల్చి చెప్పారు.

ఇక అనంత్‌ అంబానీ సతీమణి రాధిక మర్చంట్‌ కోసం పార్టీ ఇవ్వడంపై కూడా స్పందించిన జాన్వీ.. రాధిక తనకు మంచి స్నేహితురాలని, తమతో రాధిక చాలా సరదాగా ఉంటుందని .. అందుకే, వివాహానికి ముందు ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటుచేయాలని ఫ్రెండ్స్‌ అందరం అనుకున్నామని తెలిపారు. అందులోభాగంగా ప్లాన్‌ చేసి పార్టీ ఇచ్చామని, ఇందుకు రాధిక కూడా సంతోషించినట్లు జాన్వీ చెప్పుకొచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story