సరదాగా తీసింది.. పోస్టర్ అయ్యింది : ప్రభాస్ తో ఫొటోపై అనుష్క!

Anushka Shetty comments on mirchi Movie photo
Anushka Comments On Mirchi Photo : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు లలో హీరోలో ప్రభాస్, హీరోయిన్ లలో అనుష్క మొదటి లిస్టులో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..
Anushka Comments On Mirchi Photo : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు లలో హీరోలో ప్రభాస్, హీరోయిన్ లలో అనుష్క మొదటి లిస్టులో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇండస్ట్రీలో కూడా ఈ జోడికి మంచి క్రేజ్ ఉంది. బిల్లా, మిర్చి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ జోడి.. ఇక బాహుబలి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎక్కడలేని క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో చాలా సార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలను వారు చాలా సార్లు ఖండించినప్పటికీ ఆ వార్తలకి చెక్ పడడం లేదు..
ఇటీవల ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో భాగంగా ఓ నెటిజన్.. 'మిర్చి' చిత్రంలోని పెళ్లిపీటలపై కూర్చుని ఉన్న పిక్‌పై స్పందించాలంటూ కోరటంతో.. అనుష్క ఆ ఫొటోపై ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. " మిర్చి చిత్ర షూటింగ్‌లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు" అని అనుష్క వెల్లడించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇక భాగమతి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా నిశబ్దం సినిమాతో ముందుకు వచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హేమంత్ మధుకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక అటు గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీ గా ఉన్నాడు.
a candid pic taken when discussing the shot made a beautiful poster for mirchi .. a movie close to my heart uv creations first movie pramod,vamsi,vikki🥰🙏 https://t.co/07i7cyBLzN
— Anushka Shetty (@MsAnushkaShetty) October 4, 2020