Anjali: అందరినీ బయటకు పంపించి ఆ సీన్లను తీశాము.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Bahishkarana Web Series: 2006లో వచ్చిన ఫొటో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అంజలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2024 3:10 PM IST
Actress Anjali About Intimacy Scenes in Bahishkarana Web Series
X

Anjali: అందరినీ బయటకు పంపించి ఆ సీన్లను తీశాము.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Bahishkarana Web Series: 2006లో వచ్చిన ఫొటో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార అంజలి. ఆ తర్వాత కన్నడతో పాటు తమిళ సినిమాల్లో నటించిందీ బ్యూటీ. అనంతరం చాలా రోజుల గ్యాప్‌ తర్వాత సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మళ్లీ తెలుగులో బిజీ అయ్యిందీ బ్యూటీ. అనంతరం వరుసగా సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ అంజలి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

ఇటీవల 'బహిష్కరణ' అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో బోల్డ్‌ పాత్రలో నటించి మెప్పించిందీ చిన్నది. ఓవైపు గ్లామర్‌తో పాటు మరోవైపు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకుటుంది. ఇక ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్‌లో నటించడంపై అంజలి స్పందించింది. బహిష్కరణ వెబ్‌ సిరీస్‌లో అలాంటి సన్నివేశాల్లో నటించే సమయంలో సెట్‌లో అందరినీ బయటకు పంపి చిత్రీకరించినట్లు అంజలి చెప్పుకొచ్చింది. అయితే అలా చేసినా తాను కొంచెం గందరగోళానికి గురయ్యానని తెలిపింది.

ఇక కెరీర్‌ తొలి నాళ్ల నుంచి తనకు మంచి పాత్రలు వచ్చాయన్న అంజలి.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్ట్‌లనే ఎంచుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక కొన్ని సినిమాల కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ సైతం నేర్చుకున్నానని, యాక్షన్‌ సన్నివేశాలు కూడా డూప్‌ లేకుండా చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ‘నవరస’ సిరీస్‌ చేసినప్పుడు ఎదురైన ఓ అనుభవాన్ని అంజలి పంచుకుంది. 'కాస్ట్యూమ్‌ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేద'ని చెప్పుకొచ్చింది. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా గురించి మాట్లాడుతూ.. అదొక మంచి సినిమా అని తన పాత్రకు నేను ఎంతవరకు న్యాయం చేయగలను అనేదే తన చేతిలో ఉంటుందని, సినిమా ఫలితం విషయంలో తానేం చేయలేను అని చెప్పుకొచ్చింది.

ఇక సోషల్‌ మీడియా వచ్చే నెగిటివిటీ గురించి తాను అస్సలు పట్టించుకోనని చెప్పుకొచ్చిన అంజలి.. తన గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతానంది. కానీ వెంటనే మర్చిపోతానని చెప్పుకొచ్చింది. ఇతరుల కోసం పనులు చేయడం మానేశానని, పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయన్న అంజలి.. అలా వస్తున్నాయని నేను పెళ్లి చేసుకోలేను కదా. సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను అని తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story