Actress Anita: 'నువ్వునేను' హీరోయిన్‌ షాకింగ్‌ నిర్ణయం

Actress Anita: ‘నువ్వు నేను’తో తెలుగు తెరకు పరిచయమైన ముంబయి ముద్దుగుమ్మ అనిత.. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పింది.

Venkata Chari
Updated on: 13 Jun 2021 7:00 PM IST
‍Actress Anita Goodbye to Acting
X

హీరోయిన్‌ అనిత (ఫొటో ట్విట్టర్)

Actress Anita: 'నువ్వు నేను'తో తెలుగు తెరకు పరిచయమైన ముంబయి ముద్దుగుమ్మ అనిత.. ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే అనిత మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై తాను ఇంట్లోనే ఉండి.. తన బిడ్డ ఆరవ్‌ సంరక్షణ చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఇకపై సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతానా? లేదా? అనే విషయంపై ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటే తప్పకుండా అందరికీ చెబుతాను' అని అనిత ప్రకటించింది.

కాగా, అనిత ప్రస్తుతం 'నాగిని' ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తుంది. పారిశ్రామికవేత్త రోహిత్‌ను 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ ముంబయి భామ మగబిడ్డకు జన్మనిచ్చింది.


Venkata Chari

Venkata Chari

Next Story