Actress Anandhi: త్వరలో తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్..!?

* సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "శ్రీదేవి సోడా సెంటర్"

admin1
Updated on: 31 Aug 2021 3:22 PM IST
Actress Anandhi Away From Sridevi Soda Center Movie Because of Her Pregnancy
X

ఆనంది (ట్విట్టర్ ఫోటో)

Actress Anandhi: సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "శ్రీదేవి సోడా సెంటర్". బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మాత్రం నటీనటుల విషయంలో మంచి మార్కులు వేయించుకుంది. సుధీర్ బాబు మరియు ఆనంది నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది అని సినిమా చూసిన వారందరూ చెబుతున్నారు. ముఖ్యంగా ఆనంది నటన చాలా నాచురల్ గా ఉందని అందరూ ఆమెను కొనియాడుతున్నారు. ఆఖరికి చిరంజీవి, ప్రభాస్, మహేష్ వంటి స్టార్ హీరోలు సైతం ఆనంది ని పొగడ్తలతో ముంచెత్తారు.

కానీ ఒకవైపు చిత్రబృందం మొత్తం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటే ఆనంది మాత్రం ఎక్కడా కనిపించకపోవటం అభిమానులను కు నిరాశ కలిగిస్తుంది. ఈ మధ్యనే "జాంబిరెడ్డి" సినిమాతో హిట్ అందుకున్న ఆనంది "శ్రీదేవి సోడా సెంటర్" సినిమాతో కూడా మంచి మార్కులే వేయించుకుంది. కానీ ఈమె ఈ చిత్ర ప్రమోషన్స్ కి రాకపోవడం వెనుక ఒక కారణం ఉందట. ఈ ఏడాది మొదట్లో ఆనంది ఒక అసిస్టెంట్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆనంది ఆరు నెలల గర్భవతి. అందుకే చిత్ర ప్రమోషన్ ఆమె పాల్గొనలేక పోతుందని సమాచారం.

admin1

admin1

Next Story