సమంత అవుట్.. ఐశ్వర్య ఇన్?

Mahasamudram Movie : RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే

Krishna
Updated on: 19 Sept 2020 5:45 PM IST
సమంత అవుట్.. ఐశ్వర్య ఇన్?
X

Aishwarya rajesh, samantha 

Mahasamudram Movie : RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్‌ ని తాజాగా చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇచ్చింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక పట్ల బాగానే కసరత్తు చేస్తున్నారు మేకర్స్.. ముందుగా ఓ పాత్ర కోసం హీరోయిన్ గా సమంతని అనుకున్నారట దర్శకుడు అజయ్ భూపతి.. అయితే ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన వచ్చాయి.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వలన సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం.

చివరి నిమిషంలో సమంత తప్పుకోవడంతో ఆమె స్థానంలో దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేశారట. ఈ మధ్యే ఆమెకి కథ వినిపించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో టాలీవుడ్ కి పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్‌ ప్రస్తుతం తెలుగులో నానితో 'టెక్‌ జగదీశ్‌' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.

ముందుగా ఈ సినిమాని రవితేజతో చేయాలనీ అనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. కానీ ఏమైందో తెలియదు కానీ అక్కడి నుంచి కథ శర్వానంద్‌కి వెళ్ళింది. తెలుగు, త‌మిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి..

Krishna

Krishna

Next Story