Actor Vishal: నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Actor Vishal: తమిళ సినీ నటుడు విశాల్‌ ఓ కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పిపడిపోయారు. విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 May 2025 11:05 AM IST
Actor Vishal Team Gives Clarity on His Health Condition
X

Actor Vishal: నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Actor Vishal: తమిళ సినీ నటుడు విశాల్‌ ఓ కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పిపడిపోయారు. విశాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. విల్లుపురంలో జరిగిన ట్రాన్స్‌జెండర్ల అందాల పోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్ స్టేజిపైనే స్పృహ తప్పి పడిపోయారు. విశాల‌్‌ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నారు. ఆహారం తీసుకోకపోవడం వల్లనే కళ్లు తిరిగి పడిపోయాడని వైద్యులు తెలిపారు.

గతంలో కూడా విశాల్ ఇదే విధంగా ఓ వేదిపై మాట్లాడుతుండగా చేతిలో మైకు వణికిపోవడం, నీరసంగా ఉన్నవీడియో వైరల్ అయింది. అయితే అప్పుడు అతనికి ఫుల్ ఫీవర్ ఉందని అందుకే అలా షివర్ అయ్యారని తర్వాత వార్తల్లో వచ్చింది. ఇప్పుడు ఈవిధంగా కుప్పకూలిపోవడంతో ఆయన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే కంగారు పడుతున్నారు అభిమానులు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్‌ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story