Vishal: మరోసారి వార్తల్లోకి విశాల్‌.. చేయి వణుకుతోంది మళ్లీ వైరల్‌ చేస్తారా అంటూ..

Vishal: మరోసారి వార్తల్లోకి విశాల్‌.. చేయి వణుకుతోంది మళ్లీ వైరల్‌ చేస్తారా అంటూ..
x
Highlights

Vishal: హీరో విశాల్‌ ఈ మధ్య వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటించిన మగధరాజా సినిమా ఈవెంట్‌లో విశాల్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ కావడం పెద్ద చర్చకు దారి తీసింది.

Vishal: హీరో విశాల్‌ ఈ మధ్య వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటించిన మగధరాజా సినిమా ఈవెంట్‌లో విశాల్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ కావడం పెద్ద చర్చకు దారి తీసింది. ఎప్పుడూ ఫిట్‌గా యాక్టివ్‌గా కనిపించే విశాల్‌ అనారోగ్యంగా పూర్తిగా ముఖం మారిపోయినట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరికి మైక్‌ పట్టుకున్న చేతు వణకడం ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

అయితే విశాల్‌కు ఏం కాలేదని అతను కేవలం వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, డెంగ్యూ కారణంగా అలా మారిపోయారంటూ ఆయన పర్సనల్‌ టీమ్‌తో పాటు, కొందరు సినీ తారలు సైతం స్పష్టం చేశారు. కాగా తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన విశాల్‌ తన అనారోగ్యంపై కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్న విశాల్‌ ఫిట్‌గా మారారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విశాల్‌ తన ఆరోగ్యానికి సంబంధించి జరిగిన ప్రచారంలో తానే ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మాట్లాడుతూ చెయ్యి వణుకుతుంది. మరోసారి యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్ అవ్వదుగా అంటూ పంచ్ వేశారు. ఆ తర్వాత విశాల్ నార్మల్ గా మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. పంచ్‌ అదిరిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మగధరాజా సినిమాలో విశాల్ కు జోడీగా వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి నటించారు. చిత్రీకరణ జరపుకున్న 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తమిళ్‌లో పొంగల్‌ కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టి హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories