Venu Thottempudi: 8 ఏళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న వేణు

Sandeep Reddy
Updated on: 29 July 2021 2:10 PM IST
Actor Venu Thottempudi Re Entry with RamaRao On Duty Movie | RamaRao On Duty Cast
X

వేణు తొట్టెంపూడి (ఫైల్ ఫోటో)

Venu Thottempudi - RamaRao On Duty: 1999లో "స్వయంవరం" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి తన పదిహేనేళ్ళ సినిమా కెరీర్లో దాదాపుగా 26 సినిమాల్లో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కొన్ని చిత్రాల తర్వాత సరైన హిట్లు సాధించలేక రామాచారి సినిమా ఫ్లాప్ తో సినిమాలకు దూరంగా ఉంటున్న వేణు తొట్టెంపూడి సుమారుగా 8 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న "రామారావు ఆన్ డ్యూటీ" లో ఒక కీలక పాత్ర కోసం వేణు తొట్టెంపూడిని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమా హిట్ల తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము చిత్రంలో సహాయ నటుడిగా మారాడు. ఆ చిత్రం కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక డిజాస్టర్ గా మిగలడంతో దాదాపుగా కెరీర్ ముగిసినట్టే అనుకోని సినిమాలకు దూరంగా ఉన్నాడు. జగపతిబాబు లాంటి హీరోని ఆదర్శంగా తీసుకున్నడెమో తెలిదు కాని హీరోగా కాకున్నా కథలో తన పాత్ర నచ్చితే సినిమాలు చేయడానికి రెడీ అయి "రామారావు ఆన్ డ్యూటీ"తో ఎనిమిదేళ్ళ సుధీర్గ విరామానికి ఫుల్ స్టాప్ పెట్టాడు వేణు తొట్టెంపూడి. "రామాచారి"తో సినిమాలకు రామ్ రామ్ చెప్పిన వేణు "రామారావు ఆన్ డ్యూటీ" తో అయిన మంచి హిట్ కొట్టి భవిష్యత్తులో మరిన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!!


Venu Thottempudi - RamaRao On Duty


Sandeep Reddy

Sandeep Reddy

Next Story