Oscar 2021: ఆస్కార్ బరిలో సూర్య మూవీ

Oscar 2021: తమిళ స్టార్‌ హీరో సూర్య, అపర్ణా బాలమురళి నటించిన సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రం ఓ ఘనత సాధించింది.

Venkata Chari
Published on: 26 Feb 2021 7:13 PM IST
Actor Suriyas Movie Soorarai Pottru Movie on Oscar 2021
X

సూర్య (ఫోటో ట్విట్టర్ )

Oscar 2021: తమిళ స్టార్‌ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రం ఓ ఘనత సాధించింది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్ర‌తిష్టాత్మక ఆస్కార్‌ బరిలోకి నిలిచింది. 93వ ఆస్కార్‌ పోటీల్లో భాగంగా.. ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి సిద్ధమైంది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించింది. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే ఎంపికైందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లిస్ట్‌ను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది. మార్చి 5 నుంచి 10 వరకు సూరారై పొట్రు మూవీకి ఓటింగ్ జ‌ర‌గ‌నుంది. తుది జాబితాలోని చిత్రాలను మార్చి 15న ప్రకటించనున్నారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజ‌న‌ల్ స్కోర్‌తో కేట‌గిరిల్లో ఈ చిత్రం పోటీలో నిలిచిన విషయం తెలిసిందే.

కాగా తమిళంలో సూరారై పోట్రుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురాగా డబ్బింగ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, త‌క్కువ ధ‌ర‌కే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన‌ ఏయిర్‌ డెక్కన్‌ సీఈఓ గోపినాథ్‌ జీవితకథ ఆధారంగా రూపొందించారు. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ చేశారు. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సిఖ్య, 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మించగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు.


Venkata Chari

Venkata Chari

Next Story