శ్రీరెడ్డి చాట్ తో పడిపోయిన శ్రీరామ్ గ్రాఫ్.. సోనూ సూద్ సపోర్ట్ తో పెరుగుతుందా..!?

Bigg Boss 5 Updates: Actor Sonu Sood Supports Singer Sreerama Chandra in Bigg Boss 5 Telugu
x

శ్రీరెడ్డి చాట్ తో పడిపోయిన శ్రీరామ్ గ్రాఫ్.. సోనూ సూద్ సపోర్ట్ తో పెరుగుతుందా..!?

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన సపోర్ట్ శ్రీరామచంద్రకే అని చెప్పేసిన నటుడు సోనూ సూద్

Sonu Sood - Singer Sreeram: లాక్ డౌన్ కష్ట సమయంలో ఎంతో మందికి కాదనకుండా తన వంతు సహాయం చేసి దేశ వ్యాప్తంగా రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూ సూద్ తాజాగా బుల్లితెరలో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో తన అభిమాన ఇంటి సభ్యుడికి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అల్ ది బెస్ట్ చెప్పాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టంట్ సింగర్ శ్రీరామచంద్రకి సపోర్ట్ చేస్తూ తాజాగా సోనూ సూద్ అతడికి విషెస్ చెప్పాడు. బిగ్ బాస్ మొదట కొన్ని వారాలపాటు తన ఆట పాటలతో చలాకీగా ఉండి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్..మరో కంటెస్టంట్ హమీదాతో ప్రేమాయణం సాగించడం.. ఆమె ఎలిమినేట్ అవగానే రెండు మూడు వారాలపాటు డల్ అవడం చూశాము.

ఇక తాజాగా తిరిగి తన ఆటతో మాటలతో ఆకట్టుకుంటున్న ఇటీవల సోషల్ మీడియాలో నాలుగేళ్ళ క్రితం శ్రీరెడ్డితో చేసిన వాట్సప్ చాట్ బయటికి రావడంతో అప్పటివరకు ఉన్న శ్రీరామచంద్ర గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సంబంధించిన అభిమానులు ఎవరో కావాలనే ఇలా శ్రీరామచంద్రపై గతంలో జరిగిన చాట్ ని మళ్ళీ తెర మీదకు తీసుకోస్తున్నారని, అయిన ఆ చాటింగ్ లో శ్రీరామ్ తప్పు ఏ మాత్రంలేదని.. తప్పంతా శ్రీరెడ్డిదేనని శ్రీరామ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేయడం చూశాము.

తాజాగా ఎలాగైనా తమ అభిమాన ఇంటి సభ్యుడు శ్రీరామ్ ని బిగ్ బాస్ విన్నర్ గా చూడాలని అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నటుడిగానే కాకుండా కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసి మంచి పేరు తెచ్చుకున్న సోనూ సూద్.. "శ్రీరామ చంద్రని చూస్తున్నారా? నేను చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్ ఇవ్వు.. నీకు ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్" అంటూ తన విషెస్ ని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటివరకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్న శ్రీరామ్ గ్రాఫ్ కు సోనూ సూద్ సపోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories