Samantha: మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు.. హైదరాబాద్ లో సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?

Samantha Assets: వెండితెర అజంతా బ్యూటీ సమంత తన ఆస్తులను అంతకుఅంత పెంచుకుంటోంది.

Arun Chilukuri
Updated on: 9 May 2023 5:00 PM IST
Actor Samantha Buys 3 BHK Duplex Apartment in Hyderabad
X

Samantha: మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు.. హైదరాబాద్ లో సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?

Samantha Assets: వెండితెర అజంతా బ్యూటీ సమంత తన ఆస్తులను అంతకుఅంత పెంచుకుంటోంది. సినిమాల ద్వారా వచ్చే సంపాదనతో తెలివిగా ఇళ్లు కొంటూ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకుంటోంది. ముంబైలో ఈమధ్యనే రూ.15 కోట్ల విలువ చేసే విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను సమంత కొనుగోలు చేసింది. సముద్ర తీరంలో 3 బీహెచ్ కే ఫ్లాట్ ఇది. ఈ విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో ఇల్లుని సామ్ కొనుగోలు చేసింది.

రంగారెడ్డి జిల్లాలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో డ్యూప్లెక్స్ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ 13, 14 ఫ్లోర్లలో ఉందని తెలుస్తోంది. 13వ అంతస్తులో 3920 చదరపు అడుగుల ఫ్లాట్, 14వ అంతస్తులో 4024 చదరపు అడుగుల ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు మొత్తం 6 కార్ పార్కింగ్ స్లాట్స్ తో ఉన్న ఈ ఫ్లాట్ ను సమంత...నల్ల ప్రీతమ్ రెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసిందట. ఇక దీని ధర రూ.7.8 కోట్లని సమాచారం. ఇదిలాఉంటే, ముంబై లో సమంత ఫ్లాట్ కొనుగోలు చేయడంతో అక్కడకు షిఫ్ట్ అవుతుందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేయడంతో సమంత సౌత్ లోనే సెటిల్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సామ్ కు ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వంద కోట్ల విలువ చేసే ఓ ఇల్లు ఉందని టాక్. ఇక, ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే, శాకుంతలం చిత్రంతో ఇటీవలే బాక్సాఫీస్ ముందుకొచ్చిన సమంత ప్రస్తుతం తెలుగులో హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఖుషీ సినిమా చేస్తోంది. దీంతో పాటుగా బాలీవుడ్ లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ రీమేక్ లో నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story