Bollywood Drug Case: మరోసారి తెరపైకి బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు... ఆ హీరోయిన్‌కు జైలు శిక్ష తప్పదా?

Bollywood Drug Case: నటి రియా చక్రవర్తి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు నిర్ధారించిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో

Rama Rao
Updated on: 13 July 2022 5:30 PM IST
Actor Rhea Chakraborty Charged in Drugs Case | Bollywood News
X

Bollywood Drug Case: మరోసారి తెరపైకి బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

Bollywood Drug Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నటుడు సుషాంత్‌ రాజ్‌పుత్‌ కోసం బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్టు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో-ఎన్‌సీబీ నిర్ధారించింది. రియాతో పాటు మొత్తం 35 మందిని చార్జిషీట్‌లో చేర్చినట్టు ఎన్‌సీబీ తెలిపింది. తక్కువ పరిమాణంలో కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను సుశాంత్‌ రాజ్‌పుత్‌కు అందించేదని రియా డబ్బు కూడా చెల్లించినట్టు నిర్ధారించారు. ఈ కేసులో రియా సోదరుడు సోవిక్‌ చక్రవర్తి పేరును కూడా ఎన్‌సీబీ చార్జిషీట్‌లో చేర్చింది. రియా చక్రవర్తిపై నమోదైన డ్రగ్స్‌ కేసు రుజువైతే మాత్రం ఆమెకు కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణంతో డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ క్రమంలో పలువరి పేర్లు తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి ఇచ్చే డ్రగ్స్‌తోనే సుశాంత్‌ బానిసైనట్టు ఎన్‌సీబీ దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఆమెకు డ్రగ్స్‌ ఇచ్చిన వారి పేర్లను కూడా ఎన్‌సీబీ చార్జిసీట్లో చేర్చింది. అయితే తనపై చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని.. ఇప్పటికే రియా స్పష్టం చేసింది. ఈ కేసులో 2020 సెప్టెబరులో అరెస్టయ్యారు. నెల తరువాత ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2020 జూన్‌ 14న బాంద్రాలో నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మృతి చెందారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అయితే ముంబై పోలీసులు మాత్రం సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌, టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురిపై ఎన్‌సీబీ కేసులు నమోదు చేసింది.

Rama Rao

Rama Rao

Next Story