మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్.. పేద విద్యార్ధినికి అండగా!

మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్.. పేద విద్యార్ధినికి అండగా!
x
Highlights

Actor Prakash Raj Help : సాయానికి మారుపేరు అయిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎన్నో విధాలుగా సహాయపడిన ప్రకాష్ రాజ్ తాజాగా ఓ బ్రిలియేంట్ స్టూడెంట్ కి అండగా నిలిచారు.

Actor Prakash Raj Help : సాయానికి మారుపేరు అయిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎన్నో విధాలుగా సహాయపడిన ప్రకాష్ రాజ్ తాజాగా ఓ బ్రిలియేంట్ స్టూడెంట్ కి అండగా నిలిచారు. సిరిచందన అనే విద్యార్ధి మాస్టర్స్ డిగ్రీ చేయడానికి అవసరమైన ఆర్ధిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చారు ప్రకాష్ రాజ్.. పచ్చిమ గోదావరి జిల్లాకి సిరిచందన స్కూల్ నుంచే అత్యుత్తమ ప్రదర్శనని కనబరుస్తూ బీఎస్సీ కంప్లీట్ చేసింది.

ప్రస్తుతం ఆమెకి మాంచెస్టర్‌లోని యూనివర్శిటి ఆఫ్‌ సాల్‌ఫోర్ట్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి సీటు వచ్చింది. అయితే సిరిచందనకి తండ్రి లేకపోవడం ఆర్ధిక పరిస్థితి కూడా అంతత మాత్రం కావడంతో తన ఆశలు వదులుకుంది.. ఈక్రమంలో ఆమెకి ప్రకాష్ రాజ్ ఆపద్బాంధవుడు లాగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా సిరిచందన పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెను ఉన్నత చదువులు చదివించేందుకు మందుకు వచ్చారు. దీనితో సిరిచందన ఆమె తల్లి ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి..

అయితే తాజాగా 'అల్లుడు అదుర్స్' అనే సినిమా షూటింగ్ కోసం ప్రకాష్ రాజ్ హైదరాబాదుకు రాగా, అక్కడ ప్రకాష్ రాజ్ ను కలుసుకొని ధన్యవాదాలు తెలియజేసింది సిరిచందన కుటుంబం.. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ బాగా చదువుకొని వృద్దిలోకి రావాలని ప్రకాష్ రాజ్ ఆశీర్వదించారు. అటు సిరిచందన మాట్లాడుతూ యూనివర్శిటి ఆఫ్‌ సాల్‌ఫోర్ట్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి సీటు వచ్చినప్పటికీ ఆర్ధిక పరిస్థితి బాలేక ఆశలు వదులుకున్న సమయంలో ప్రకాష్ రాజ్ తనని ప్రోత్సహించారని డీగ్రీకి సంబంధించిన ఫీజులు కూడా ఆయనే కట్టారని తెలిపింది.

అయన ఇచ్చిన ప్రోత్సహంతో మరింతగా చదువుకొని, ప్రకాష్ రాజ్ ని స్పూర్తిగా తీసుకొని మరికొందరికి సహాయపడతాను అని సిరిచందన చెప్పుకొచ్చింది.



Show Full Article
Print Article
Next Story
More Stories