నరేష్ చూపు.. జబర్దస్త్ వైపు!

K V D Varma
Published on: 28 Nov 2019 6:57 PM IST
నరేష్ చూపు.. జబర్దస్త్ వైపు!
X
నరేష్

ఏడేళ్లుగా తెలుగు టీవీ షోలలో పాప్యులర్ షోగా దూసుకుపోతోంది. జబర్దస్త్ షో ఓ నవ్వుల సంచలనం. తెలుగు టీవీ తెరపై ఎన్నో చరిత్రలు సృష్టించిన షో అది. ఈ షో లో ఒక్క స్కిట్ చేసినా చాలు అనుకునే ఔత్సాహికులు ఎందరో. స్కిట్ లలో చిన్న పాత్ర వేయడానికి వచ్చి.. తమ టాలెంట్ తో టీమ్ లీడర్స్ గా ఎదిగిన కళాకారులు ఎందరో ఉన్నారు జబర్దస్త్ లో. ఇక అందులో తమ నైపుణ్యాల్ని చూపించి వెండి తెర బాట పట్టిన వారూ ఉన్నారు. నిజానికి వెండితెర పై కామెడీ వేషాలు వేయాలని ఉత్సాహం ఉంటె..జబర్దస్త్ లో ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే చాలు అనేట్టుగా ఔత్సాహికులకు ఉత్సాహాన్నిచ్చింది జబర్దస్త్.

జబర్దస్త్ ప్రారంభం నుంచి తన చిరునవ్వుతో న్యాయనిర్ణేతగా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు షో లో నటించే వారిలోనూ ఎంతో పేరు తెచ్చుకున్న నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. దానికి కారణాలు ఏమైనా.. గత వారం రోజా ఒక్కరే షో నడిపించారు. ఈవారమూ అలానే కొనసాగనుంది.

ఇపుడు జబర్దస్త్ లో నాగబాబు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఆలీ..బండ్ల గణేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ, మల్లెమాల ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ నడుస్తోంది. ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు జబర్దస్త్ కోసం పరశీలిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

తాజాగా సీనియర్ స్టార్ నరేష్ పేరూ వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే నరేష్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. జబర్దస్త్ కార్యక్రమం తన ఫేవరెట్ షో అని చెప్పారు. అంతేకాదు జబర్దస్త్ లో అవకాశం వస్తే తప్పకుండా ఒప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో నరేష్ కూడా మల్లెమాల లిస్ట్ లో వున్నారని అందరూ అనుకుంటున్నారు. ఇపుడు మరి ఎవరు ఫైనల్ గా జబర్దస్త్ లో నాగబాబు ప్లేసు రీప్లేసు చేస్తారో వేచి చూడాల్సిందే!

K V D Varma

K V D Varma

Next Story