పవన్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు

ఒకప్పుడు కామెడీ హీరోగా బోలెడు హిట్ సినిమాలను నమోదు చేసుకుని ప్రస్తుతం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో మనకు కనిపిస్తున్న నటుడు నరేష్.

Ruthvik
Published on: 22 Jan 2019 4:07 PM IST
పవన్ సినిమాలో విలన్ గా ప్రముఖ నటుడు
X

ఒకప్పుడు కామెడీ హీరోగా బోలెడు హిట్ సినిమాలను నమోదు చేసుకుని ప్రస్తుతం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో మనకు కనిపిస్తున్న నటుడు నరేష్. ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చి 48 సంవత్సరాలు పూర్తి కాగా, నరేష్ మీడియాతో మాట్లాడారు. తాను త్వరలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక విలన్ పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా రోజులైంది కదా, మరి పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ నటించకపోయినా ఈ సినిమా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉండబోతోంది.

అదే 'పవనిజం 2'. 2014 లో విడుదలైన 'పవనిజం' సినిమాకు సీక్వెల్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాలో నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఐడియాలజీ మరియు నమ్మకాల పై ఆధారపడి ఉంటుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్కే స్టూడియోస్ పతాకంపై రాజశ్రీ నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో అందరూ కొత్త నటులు కనిపించనున్నారని సమాచారం.

Ruthvik

Ruthvik

Next Story