అభిమానికి క్షమాపణలు చెప్పిన నటుడు మాధవన్‌!

అభిమానికి క్షమాపణలు చెప్పిన నటుడు మాధవన్‌!
x

Madhavan 

Highlights

Madhavan Sorry To Fan : అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం నిశబ్దం.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది..

Madhavan Sorry To Fan : అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం నిశబ్దం.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది.. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన నటుడు మాధవన్ సినిమా ప్రమోషనల్ లో భాగంగా తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ''నిశ్శబ్దం' ఫ్లాష్‌బ్యాక్‌ కన్విన్స్‌ చేసేలా లేదు. మీరేం అంటారు?' అని అడగగా, దీనికి మాధవన్ స్పందిస్తూ.. 'ఇప్పుడు నేను కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పగలను' అని మాధవన్ సమాధానం ఇచ్చాడు.

ఇంకా తనకిష్టమైన సినిమా `సఖి` అని, తాను అద్భుతంగా నటించిన పాత్ర `రాకెట్రీ` అని, ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా మాధవన్ వెల్లడించాడు. ఇక అటు నిశబ్దం సినిమాలో మాధవన్ నెగటివ్‌ షేడ్స్ ఉన్న సైకో పాత్రలో నటించారు. మాధవన్ తో పాటుగా అంజలి, శాలిని పండే, మాధవన్ ఈ చిత్రంలో కీలక పత్రాలు పోషించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాని కోన ఫిలిం కార్పొరేషన్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories