Actor kick Shyam Arrested: ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్టు

Actor kick Shyam Arrested: ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్టు
x
Highlights

Actor kick Shyam Arrested: ప్రముఖ సినీనటుడు కిక్‌ శ్యామ్‌ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో...

Actor kick Shyam Arrested: ప్రముఖ సినీనటుడు కిక్‌ శ్యామ్‌ను మంగళవారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో శ్యామ్ ఓ ఫోక‌ర్ క్ల‌బ్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ల‌బ్‌లో శ్యామ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించ‌డంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమ‌తులు లేకుండా శ్యామ్ పేకాట‌, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో శ్యామ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెలుగు, తమళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. కిక్‌లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఆకట్టుకుని టాలీవుడ్‌లో కిక్‌ శ్యామ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమళ సినిమాల్లో న‌టించిన శ్యామ్ మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories