Brahmaji Tweet To Sonu Sood : సోనూసూద్ కి ఫన్నీ రిక్వెస్ట్ పెట్టిన బ్రహ్మాజీ

Brahmaji Tweet To Sonu Sood: లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు

Krishna
Published on: 21 Aug 2020 2:54 PM IST
Brahmaji Tweet To Sonu Sood  : సోనూసూద్ కి ఫన్నీ రిక్వెస్ట్ పెట్టిన బ్రహ్మాజీ
X

Brahmaji Tweet To Sonu Sood: లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కష్టాలు అంతా ఇంతా కాదు... వారిని ఆదుకోవడానికి ఎంతోమంది ముందుకు వచ్చారు అందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒకరు.. వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు. ఇప్పుడు కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు సోనూసూద్‌.. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. నిజానికి సోనూసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరో... దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన, విన్నాగాని సోనూసూద్‌ పేరే వినిపిస్తుంది.

అయితే సోనూసూద్ ని కొందరు వింత కోరికలు కూడా కోరుతున్నారు.. దీనిపైన సోనూసూద్ కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తున్నాడు.. అందులో భాగంగానే నటుడు బ్రహ్మాజీ కూడా సోనూసూద్ కి ఓ ఫన్నీ రిక్వెస్ట్ పెట్టాడు.. ట్విట్టర్ వేదికగా బ్రహ్మాజీ...స్పందిస్తూ.. 'డియర్‌ సూపర్‌మ్యాన్‌ సోనూ భాయ్‌.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్‌ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్‌ నన్ను ఇక్కడకు తీసుకెళ్లు. క్రొయేషియా' అంటూ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపైన సోనుసూద్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. ఇక సోనూసూద్, బ్రహ్మాజీ కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు.


Krishna

Krishna

Next Story