Arjun's Daughter Aishwarya Tests Positive for Covid19: ప్రముఖ స్టార్ కూతురికి కరోనా పాజిటివ్...

Arjun's Daughter Aishwarya Tests Positive for Covid19: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.

Sumitra
Updated on: 20 July 2020 6:54 PM IST
Arjuns Daughter Aishwarya Tests Positive for Covid19: ప్రముఖ స్టార్ కూతురికి కరోనా పాజిటివ్...
X
Arjun and Aishwarya (File Photo)

Arjun's Daughter Aishwarya Tests Positive for Covid19: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకులతో పాటు సినీ ఇండస్ట్రీలో చాలా మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో కరోనా కేసులు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.కరోనా లక్షణాలు ఉండడంతో ఆమె కరోనా పరీక్షలు చేయించుకన్నానని, ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు.

ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ హోంక్వారంటైన్ లో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు మెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని ఆమె ప్రజలను కోరారు. ఇక గత కొద్దిరోజులుగా తనతో కాంటాక్టులో ఉన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఐశ్వర్యా ట్విట్టర్ ద్వారా కోరింది. ఆమె అభిమానులు వీలైనంత త్వరగా ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఇప్పటికే అర్జున్ కుటుంబంలో ఆయన మేనల్లుడు ధృవ సర్జకు కరోనా సోకగా అతడి భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

Sumitra

Sumitra

Next Story