'గమ్యం' సినిమా చూసిన తర్వాత ఈవివి రియాక్షన్ ఇలా ఉందట

అల్లరి నరేష్ నటించిన సినిమాల్లో 'గమ్యం' సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. క్రిష్ దర్శకత్వంలో...
అల్లరి నరేష్ నటించిన సినిమాల్లో 'గమ్యం' సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. క్రిష్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ 'గాలి శీను' పాత్రలో కనిపించాడు. శర్వానంద్ కంటే అల్లరి నరేష్ పాత్రకు పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. కనిపించింది కొన్ని సీన్స్ లో మాత్రమే అయినా అల్లరి నరేష్ పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అప్పటిదాకా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అల్లరి నరేష్ గమ్యం సినిమాలో నవ్వించడమే కాక ఏడిపించాడు కూడా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ గమ్యం సినిమా చూసిన ఈవివి రియాక్షన్ గురించి చెప్పారు.
" గమ్యం సినిమా గురించి తెలుసు కానీ నా పాత్ర గురించి ఆయనకు ముందుగా చెప్పలేదు. సినిమా పూర్తి అయ్యాక నాన్న కోసం ప్రత్యేక ప్రీమియర్ వేశాము. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను కారు ఎక్కించుకుని కొంత దూరం తీసు కెళ్లి 'నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా. ముందుగా ఇలాంటి పాత్ర చేస్తున్నాను అంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదు అందుకే నాకు ముందే చెప్పకుండా మంచి పని చేశావ్' అని అన్నారు" అని చెప్పుకొచ్చాడు నరేష్. ఇక 'మహర్షి'లో నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
సర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMT