Samantha: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన సమంత..? ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షాతో

Samantha: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన అందాల తార సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Jun 2024 12:27 PM IST
According Latest Report Samantha got Chance in Shahrukh Khan Movie
X

Samantha: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన సమంత..? ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షాతో

Samantha: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన అందాల తార సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాలకు విరామం ప్రకటించింది. అప్పటి వరకు నిర్మాతల దగ్గర తాను తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్‌ను కూడా తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇన్ని రోజులు విరామం తీసుకున్న సమంత మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నట్లు సమాచారం. తాజాగా మళయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి సరసన ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు సామ్‌ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సమంత మరో బంపరాఫర్‌ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది.

రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్‌ కుమార్ దర్శకత్వంలో ‘డంకీ’ తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో షారుక్‌కు జోడిగా సమంతను ఎంపిక చేసినట్లు సమాచారం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కనున్న యాక్షన్‌ సినిమాలో నటించేందుకు సమంత సైతం అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story