Aakashavani: 'ఆకాశవాణి' రిలీజ్ వాయిదా..!

Aakashavani Movie Release Date Postponed
x

ఆకాశవాణి మూవీ ట్విట్టర్ ఇమేజ్


Highlights

Aakashavani: ద‌ర్శ‌క‌థీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న‌ తాజా చిత్రం ''ఆకాశవాణి''.

Aakashavani: ద‌ర్శ‌క‌థీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న‌ తాజా చిత్రం ''ఆకాశవాణి''. విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను , ప్రశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుద‌ల వాయిదా వేశారు. ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల విడుదల చేయలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'ఆకాశవాణి' చిత్ర బృందం ఓ ప్రకటన ఇచ్చింది.

సాదారణ పరిస్థితులు ఉండుంటే ఈరోజు 'ఆకాశవాణి' సినిమాని చూసి మనందరం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈ టెస్టింగ్ టైంలో అందరు ఇంట్లో ఉంటూ సేఫ్ గా ఉండటం ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్ ప్రకటించబడుతుంది'' అని మేకర్స్ పేర్కొన్నారు

కాగా విభిన్నమైన కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్నారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - 'మన కోన' పాట మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories