8 years For Julayi : బన్నీ జులాయికి ఎనిమిదేళ్ళు!

8 years For Julayi : బన్నీ జులాయికి ఎనిమిదేళ్ళు!
x
8 years For Julayi
Highlights

8 years For Julayi : ఆర్య, బన్నీ, దేశముదురు అల్లు అర్జున్ కి మంచి హిట్స్ ఇచ్చిన మూవీస్.. కానీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ ఒక్కటి కూడా లేదు

8 years For Julayi : ఆర్య, బన్నీ, దేశముదురు అల్లు అర్జున్ కి మంచి హిట్స్ ఇచ్చిన మూవీస్.. కానీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మూవీ ఒక్కటి కూడా లేదు. కానీ అలాంటి సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీ బన్నీ రేంజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించింది.. ఈ సినిమాకి నేటితో ఏనమిదేళ్ళు నిండాయి.. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* వరుడు, బద్రీనాథ్ లాంటి ప్లాపుల తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చిన సినిమా ఇది. అంతేకాకుండా అల్లు అర్జున్ పెళ్లి తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా కూడా ఇదే..

* ఖలేజా లాంటి ప్లాపు సినిమా తర్వాత వెంకటేష్ తో ఓ సినిమాని అనుకున్నాడు త్రివిక్రమ్ కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో బన్నీతో సినిమాని మొదలుపెట్టాడు త్రివిక్రమ్..

* జస్ట్ స్క్రిప్ట్ లైన్ మాత్రం విని సినిమాకి సైన్ చేశాడట అల్లు అర్జున్..

* ఈ సినిమాకి ముందుగా హాని అనే టైటిల్ అనుకున్నారు కానీ ఆ తర్వాత జులాయి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

* ముందుగా ఈ సినిమాలో విలన్ గా కన్నడ నటుడు సుదీప్ ని అనుకున్నాడు త్రివిక్రమ్ .. కానీ సుదీప్ డేట్స్ అడ్జెస్ట్ కాక సోనూసూద్ ని తీసుకున్నాడు త్రివిక్రమ్..

* ఈ చిత్రం 9 ఆగస్టు 2012 న ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో విడుదలైంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో అతిపెద్ద రిలీజ్ ..

* ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత బన్నీకి మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ముఖ్యంగా చిన్నపిల్లలో మరీనూ..

* ఈ సినిమాని మొత్తం 35 కోట్లతో తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దాదాపుగా 60 కోట్లను కొల్లగొట్టింది ఈ సినిమా..

* 2012 నంది పురస్కారాలులో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.

* ఉత్తమ కొరియోగ్రాఫర్ (జానీ)(మీ ఇంటికి ముందో గేటు) విభాగంలో నంది అవార్డు లభించింది. ఉత్తమ సహాయనటుడుగా రాజేంద్రప్రసాద్ కి అవార్డు లభించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories