logo
సినిమా

'1997' చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన ఆర్జీవీ!

1997 Movie First Look Released by Ram Gopal Varma
X

1997 ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

Highlights

1997 Movie: ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997

1997 Movie: డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు. తాజగా 1997 చిత్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు .

అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ .. టైటిల్ చాలా బాగుంది. 1997 లో ఏమి జరిగింది అన్న క్యూరియాసిటీ నెలకొంది. ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసినట్టు ఉంది. ఈ సినిమా హీరో, దర్శకుడు మోహన్ కు ఈ సినిమా సక్సెస్ అయి అతనికి మంచి పేరు తేవాలి, ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.

నటుడి శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ .. మా అభిమాన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి చేతులమీదుగా 1997 సినిమాలోని నా లుక్ ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వర్మ గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాతో హీరోగా, దర్శకుడిగా చేస్తున్న మోహన్ కు ఈ సినిమా ద్వారా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో, దర్శకుడు డా. మోహన్ మాట్లాడుతూ .. ముందుగా వర్మ గారికి థాంక్స్ .. ఈ సినిమాలో ఉన్న మూడు ముఖ్యపాత్రల్లో ఒకటైన శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రను రివీల్ చేసినందుకు మా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వర్మగారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని బర్నింగ్ ఇష్యుని తీసుకుని దానికి కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేశా. ఈ సినిమా విషయంలో నాకు ప్రతి విషయంలో సపోర్ట్ అందించిన కోటి గారికి, అలాగే హీరో నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

నటీనటులు:

డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు...

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్.

ఎడిటింగ్ : నందమూరి హరి

సంగీతం: కోటి

కెమెరా: చిట్టి బాబు

నిర్మాత: మీనాక్షి రమావత్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.

పీఆర్ ఓ: సురేష్ కొండేటి.

Web Title1997 Movie First Look Released by Ram Gopal Varma
Next Story