ఆ కష్టమే మగధీర విజయరహస్యం!

ఆ కష్టమే మగధీర విజయరహస్యం!
x
Highlights

విజయం అంత తేలికగా రాదు. సినిమా పరిశ్రమలో అయితే అది మరీ కష్టం. ఎంతో మంది కల్సి కట్టుగా శ్రమిస్తేనే అది సొంతం అవుతుంది. కచ్చితత్వం.. అనే పదాన్ని నమ్మిన...

విజయం అంత తేలికగా రాదు. సినిమా పరిశ్రమలో అయితే అది మరీ కష్టం. ఎంతో మంది కల్సి కట్టుగా శ్రమిస్తేనే అది సొంతం అవుతుంది. కచ్చితత్వం.. అనే పదాన్ని నమ్మిన వారికే వరుస బ్లాక్ బస్టర్లు సాధ్యమవుతాయి. కచ్చితత్వానికి కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పిన దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో కొందరే ఉన్నారు. ఈ తరంలో అలాంటి వారు రాజమౌళి. తాను ఒక్క సీన్ అనుకుంటే దానికోసం ఎంతసేపైనా.. ఎన్నిరకాలుగా నైనా కష్టపడటమే ఆయనకి తెల్సింది. ఆ కష్టం తెరమీద కాసుల వర్షాన్ని కురిపిస్తుంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. రాజమౌళికి పూర్తిస్థాయి అద్భుత విజయం అందించిన సినిమా మగధీర. అంతకు ముందు వరకూ కూడా అపజయమన్నది లేకపోయినా, ఆ సినిమాలన్నీ ఒకెత్తు.. మగధీర ఒకెత్తు. ఈ సినిమా తో రాజమౌళి ఒక్కరే కాదు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా ఒక్కసారిగా స్టార్ డం అందుకున్నారు. ఈ సినిమా వచ్చి పదేళ్ళు అయింది. ఈ సందర్భంగా సినిమాలో కచ్చితత్వం కోసం రాజమౌళి ఎంత కష్టపదతారో తెలిపే వీడియో ఒకటి షేర్ చేసింది గీతా ఆర్ట్స్. పంచదారా బొమ్మ పాట మగదీరలో ఎంత హిట్ పాటో చెప్పక్కర్లేదు. ఆ పాటలో ఓ సందర్భంలో నీరు పై నుంచి పడుతుంటే రామ్ చరణ్ దాని మధ్యలో ఓ గీతలా వేలితో గీస్తుంటే ఆ గీతలో కాజల్ కనిపిస్తుంది. చాలా అద్భుతమైన సీన్ అది. కేవలం రెండు సెకన్ల లోపే ఆ సీన్ ఉంటుంది. కానీ దాని ఇంపాక్ట్ ప్రేక్షకుడికి ఇప్పటికీ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ రెండు సెకన్ల సీన్ కోసం రాజమౌళి, రామ్ చరణ్, కాజల్ ఎంత కష్టపడ్డారో తెలిపే ఐదు నిమిషాల వీడియో ఇప్పుడు గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. ఈ వీడియో చూస్తె చాలు పదేళ్ళయినా మగధీర సినిమాని తలచుకుని సగటు ప్రేక్షకుడు ఎందుకు మురిసిపోతాడో చెప్పడానికి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories