Nani 'V' Movie : నాని 'వి' కి భారీ లాభాలు!

Nani V Movie : నాని వి కి భారీ లాభాలు!
x

Nani 'V' Movie

Highlights

Nani 'V' Movie : విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం 'V'.. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు

Nani 'V' Movie : విభిన్న చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం 'V'.. ఈ సినిమాలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషించగా, అదితీరావ్ , నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. ఇది నాని కి 25 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.. అమిత్‌ త్రివేది సంగీతమందించారు. కరోనా వలన వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 05 న అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్ అయింది.

అయితే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ చిత్ర నిర్మాతకి పదికోట్ల లాభం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని OTT రైట్స్ కింద అమేజాన్ ప్రైమ్ సంస్థ 31 కోట్లకు తీసుకుందట.. ఇక శాటిలైట్ హక్కులకు జెమిని టీవీ రూ. 8 కోట్లు చేల్లిచిందట.. అటు హిందీ డబ్బింగ్ రూ. 7 కోట్లు పలికిందట.. అటు సినిమాకి రూ. 33కోట్లు పెట్టుబడి అయిందట.. ఇలా చూసుకుంటే సినిమాకి రూ. 13 కోట్లు లాభం వచ్చినట్టు అవుతుంది, అయితే 3 కోట్లు వడ్డీలకు పోగా మొత్తం పదికోట్ల లాభం వచ్చినట్టుగా సమాచారం.. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

ఇక ఈ సినిమాలో నాని పూర్తి నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించగా.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా సుధీర్‌ బాబు మెప్పించాడు. అదితీరావ్ , నివేత థామస్ తమతమ పాత్రలో మెప్పించారు. వెన్నల కిషోర్ తన దైన కామెడీతో మెప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories