Nani Sudheer Babu 'V' Movie: భారీ ధరకు అమ్ముడుపోయిన నాని 'వి' హిందీ రైట్స్!

Nani Sudheer Babu V Movie: భారీ ధరకు అమ్ముడుపోయిన నాని వి హిందీ రైట్స్!
x
Highlights

Nani Sudheer Babu 'V' Movie | తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు..

Nani Sudheer Babu 'V' Movie | తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు.. కానీ విభిన్న కథా చిత్రాల దర్శకులు కొందరే ఉన్నారు.. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు.. చేసినవి తక్కువే సినిమాలే అయిన ఆయన నుంచి ఓ సినిమా వస్తుంది అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన అష్టాచమ్మా, అంతకుముందు ఆ తరవాత, గోల్కొండ హై స్కూల్, సమ్మోహనం చిత్రాలు చాలా క్లాస్ సినిమాలు.. అయితే ఇప్పుడు ఆయన రూట్ మార్చి 'v' అనే సినిమాని చేశారు..

ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం అందించాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం.. ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ చాలా ప్రయ‌త్నాలు చేసింది. కానీ అప్పుడే క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చడంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే, ఈ చిత్రం సెప్టెంబర్ 05 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది అని చిత్ర బృందం ప్రకటించింది.. అయితే, అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగా (సెప్టెంబర్4) ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఇక డిజిటల్‌లో విడుదలైన వి పరవాలేదనిపించింది. టాక్ నెగటివ్ గా ఉన్నా చాలా మంది చూస్తుండటం విశేషం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాకు సంబందించి మరో డీల్ జరిగిందంటూ.. రీసెంట్ గా 'వి' సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి అని. దాదాపు ఈ సినిమా 8 కోట్ల రేటు దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడుపోయాయట. ఈ సినిమా కి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఎకంగా 8.4 కోట్ల డీల్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories