'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన కీరవాణి

RRR Movie
x
RRR Movie
Highlights

'బాహుబలి' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజిలో కాకపోయినా టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'బాహుబలి' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజిలో కాకపోయినా టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా కథ ఎలా ఉండబోతుంది, హీరోల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు చర్చనీయాంశాలుగా మారాయి. ఈ విషయమై బోలెడు వార్తలు బయటకు వచ్చినప్పటికీ వాటిలో నిజానిజాలు ఎవరికీ తెలియదు.

అయితే ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఎం.ఎం.కీరవాణి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. "ఈ మధ్యనే సినిమా షూటింగ్ మొదలైంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా మ్యూజిక్ కంపోజిషన్ నేను మార్చిలో మొదలు పెట్టబోతున్నాను. ఈ సినిమా లో మీరు ట్రెండీ అలాగే పీరియడ్ మ్యూజిక్ ను వినొచ్చు" అని అన్నారు కీరవాణి. అయితే ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుందని ఫిలిం నగర్ లో కొందరు గుసగుసలాడుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా 2020 లో విడుదల కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories