'భారతీయుడు 2' లో బాలీవుడ్ స్టార్ హీరో నటించట్లేదట

భారతీయుడు 2 లో బాలీవుడ్ స్టార్ హీరో నటించట్లేదట
x
Highlights

ఈ మధ్యనే '2.౦' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన క్రియేటివ్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'భారతీయుడు' సీక్వెల్ అయిన 'భారతీయుడు 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ...

ఈ మధ్యనే '2.౦' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన క్రియేటివ్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'భారతీయుడు' సీక్వెల్ అయిన 'భారతీయుడు 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ లోని మొదటి షెడ్యూల్ చెన్నైలో మొదలైంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం యూనిట్ సభ్యులు ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెండవ షెడ్యూల్ను మార్చిలో మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ ఓవర్సీస్లో జరగనుందని తెలుస్తోంది.

మొదట ఈ సినిమా కోసం బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ 'తానాజీ ది అన్సన్గ్ వారియర్' సినిమాతో బిజీగా ఉండటం వలన భారతీయుడు సినిమా కోసం డేట్లు కేటాయించలేకపోయారు అందువల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. మరి ఈ పాత్ర కోసం శంకర ఎవరిని ఎంపిక చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories