మూడురోజుల్లో సమాధానమివ్వండి..బిగ్‌బాస్ కేసులో సంబంధిత చానెల్ కు పోలీసుల నోటీసులు

మూడురోజుల్లో సమాధానమివ్వండి..బిగ్‌బాస్ కేసులో సంబంధిత చానెల్ కు పోలీసుల నోటీసులు
x
Highlights

వివాదాస్పదంగా మారిన బిగ్‌బాస్ 3 కి సంబంధించి బంజారాహిల్స్ లో పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు...

వివాదాస్పదంగా మారిన బిగ్‌బాస్ 3 కి సంబంధించి బంజారాహిల్స్ లో పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలో పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లోని స్టార్‌ మా కార్యాలయ అడ్మిన్‌ హెడ్‌ శ్రీధర్‌కు నోటీసులు అందించారు. 'బిగ్‌బాస్‌' ఇన్‌ఛార్జి శ్యాంతో పాటు రవికాంత్‌, రఘు, శశికాంత్‌లపై బిగ్‌బాస్‌' ఒప్పంద వ్యవహారంతో పాటు కాస్టింగ్‌ కౌచ్‌పై శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు.

కేసులో విచారణ చేపట్టి వివరాలు సేకరించేందుకు స్టార్‌ మా కార్యాలయ అడ్మిన్‌ హెడ్‌ శ్రీధర్‌కు 91, 160 సీఆర్‌పీసీ కింద నోటీసులను అందించారు. ఒప్పంద వ్యవహారం, ఎంపికకు ఉన్న నిబంధనలు, శ్యాంతో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. నోటీసులపై ఉన్నత స్థాయిలో చర్చించి రెండు రోజుల్లో సమాధానమిస్తామని పోలీసులకు శ్రీధర్‌ సమాధానమిచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories