రివ్యూ : డిస్కోరాజా

రివ్యూ : డిస్కోరాజా
x
disco raja
Highlights

మూస కథలతో సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరో రవితేజకి హిట్ లేకుండా చాలా రోజులు అయింది. ఈ క్రమంలో తన రూట్ మార్చి విభిన్నమైన కథతో డిస్కోరాజా అంటూ...

మూస కథలతో సినిమాలు చేసుకుంటూ వస్తున్న హీరో రవితేజకి హిట్ లేకుండా చాలా రోజులు అయింది. ఈ క్రమంలో తన రూట్ మార్చి విభిన్నమైన కథతో డిస్కోరాజా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వి. ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే సినిమాలోని టీజర్స్ ఉన్నాయి. మరి సినిమా ఆ అంచనాలను ఏ మేరకు నిలబెట్టింది అన్నది మన రివ్యూలో చూద్దాం..

కథ :

లఢఖ్‌లో మంచులో గడ్డకట్టుకుపోయిన ఓ మృతదేహాన్ని ముంబాయికి చెందిన శాస్త్రవేత్తల బృందం కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అతను బతుకుతాడు. కానీ గతాన్ని మర్చిపోతాడు. కానీ అతను మర్చిపోతాడు. ఈ క్రమంలో అతను తమ సోదరుడు వాసుగా(రవితేజ) అని ఢిల్లీ నుంచి అతడి కుటుంబసభ్యులు వస్తారు. ఈ క్రమంలో మరోవైపు ఆ వ్యక్తిని డిస్కోరాజా(రవితేజ) అనుకొని చెన్నైకి చెందిన పెద్ద గ్యాంగ్‌స్టర్‌ బర్మా సేతు(బాబీసింహా) చంపడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఈ వాసు ఎవరు ? డిస్కోరాజా ఎవరు ? ఇద్దరు ఒకేరేనా లేకా వేరా? ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్ పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే సినిమాని చూడాల్సిందే..

ఎలా ఉందంటే ?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా రకాల రివెంజ్ స్టొరీలు వచ్చాయి. ఇది కూడా రివెంజ్ స్టొరీనే కాకపోతే దీనికి సైన్స్ ఫిక్షన్‌, తగినంతగా కామెడీని ఆడ్ చేసి దర్శకుడు చేసిన ప్రయత్నం గొప్పది అని చెప్పాలి. సినిమా మొదలు పెట్టిన అర్ధగంట వరకు అసలు ఎం జరుగుతుందో ప్రేక్షకుడికి అర్ధం కాదు. మంచు కొండల్లో ఓ శవం దొరకడం,దానికి డాక్టర్లు ఊపిరిపోయడం, ఆ ఊపిరి పోసుకున్న వ్యక్తికి గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం లాంటివి సన్నివేశాలు నడుస్తుంటాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సన్నివేశాలతో సినిమా పైన హైప్ క్రియేట్ చేసాడు దర్శకుడు.

ఇక రెండోభాగంకి వచ్చేసరికి కథ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో నడుస్తుంది. ఇక్కడ కథ ప్రేక్షకులు అంచనా వేసిందే అయినప్పటికీ బాబీసింహ, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక రవితేజ, నభా నటేష్ మధ్య జరిగే లవ్ ట్రాక్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఇక సినిమాలో వచ్చే పతాక సన్నివేశాలు మళ్ళీ సినిమాపైన ఆసక్తిని కలిగిస్తాయి. కానీ కథ గమనం నెమ్మదిగా నడవడం, వావ్ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టే సన్నివేశాలు పెద్దగా లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు.

ఎవరెవరు ఎలా చేశారంటే ?

సినిమా మొత్తానికి రవితేజ బిగ్గెస్ట్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. వన్ మాన్ షోగా సినిమాని తన భుజాలపైన వేసుకొని నడిపించాడు. పలు కోణాల్లో తన నటనను కనబరిచాడు రవితేజ.. ఇక నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బాబీసింహ నటన సినిమా స్థాయిని పెంచింది. వెన్నల కోశోర్, సునీల్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదని అనిపించారు.

సాంకేతికవర్గం :

సినిమాకి ప్రధాన బలం కార్తీక్ ఘట్టమనేనిని సినిమాటోగ్రఫీ.. స్క్రీన్ పైన అతని కెమరా పనితనానికి చప్పట్లు కొట్టకుండా ఉండలేము. ఇక తమన్ అందించిన నేపధ్యం సంగీతం సినిమాకి మరో అదనపు బలంగా నిలిచింది .. సైన్స్ ఫిక్షన్ లో వచ్చే సన్నివేశాలకి అతను ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది. అబ్భురి రవి మాటలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

చివరగా : రవితేజ వన్ మ్యాన్ షో


డిస్కోరాజా ట్విట్టర్ రివ్యూ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories