Disco Raja Twitter Review: రవితేజ మార్క్ సినిమా

Disco Raja Twitter Review: రవితేజ మార్క్ సినిమా
x
Highlights

మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. హై ఎనర్జీతో సినిమాలో రవితేజ చేసే యాక్షన్ అందరికీ నచ్చుతుంది. ఒక ప్రత్యేకమైన స్టైల్ తో...

మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. హై ఎనర్జీతో సినిమాలో రవితేజ చేసే యాక్షన్ అందరికీ నచ్చుతుంది. ఒక ప్రత్యేకమైన స్టైల్ తో రవితేజ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. రవితేజ సినిమా అంటే వినోదానికి ఢోకా ఉండదని మెజార్టీ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కిక్ లాంటి సినిమా అందుకు ఉదాహరణ. ఇక రవితేజ ఉంటె సినిమా కథ ఎలా ఉన్నా..సినిమా మొత్తాన్ని తన చుట్టూ తిప్పేసుకుంటారని ప్రేక్షకులు నమ్ముతారు. అటువంటి రవితేజకు ఈమధ్య కాలంలో సరైన సీనియా పడలేదు. కచ్చితంగా హిట్ అవుతాయన్న సినిమాలన్నీ సో..సో గానిలిచిపోయాయి. అయినా సరే, నిర్మాతలు మాత్రం రవితేజను నమ్ముతూనే ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడంలో బిజీగా ఉండే రవితేజ నుంచి కొద్దిపాటి ఆలస్యంగా ఓ సినిమా వచ్చింది. అదే..డిస్కోరాజా!


ఈరోజు జనవరి 24న రవితేజ డిస్కోరాజా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. పండగ సినిమాల తరువాత వస్తున్న తెలుగు సినిమా ఇదే. దీంతో ఈసినిమా ఏమాత్రం బావున్నా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన డిస్కోరాజా సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ ముగ్గురు హీరోయిన్లు గా నటించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక విలన్ గా బాబీ సింహా రవితేజ తలపడ్డారు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమాను భారీస్థాయిలో స్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. దీంతో అక్కడ సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకుంటున్నారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం..

రవితేజ మార్క్ సినిమా..


డిస్కోరాజా పక్కా రవితేజ మార్క్ సినిమా అని చెబుతున్నారు. రవితేజ సినిమాలో తన మార్క్ నటనతో సినిమాను ఒక రేంజిలోకి తీసుకు వెళ్లారని చెబుతున్నారు. ఎక్కువ శాతం మంది సినిమా బావుండనీ, రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశారనీ ట్వీట్లు చేస్తున్నారు. రవితేజ యాక్షన్ కు వెన్నెల కిషోర్ కామెడీ తోడై సినిమా అంతా వినోదాత్మకంగా ఉందని కొందరు చెబుతున్నారు. కొత్త కాన్సెప్ట్ తో ఈసినిమా వచ్చిందని చెబుతున్న కొంతమంది ఇంటర్వెల్ బ్యాంగ్..క్లైమాక్స్ సినిమాలో వెరైటీ గా ఉన్నాయని అంటున్నారు. ఇక కొంత మంది మాత్రం సినిమా అనుకున్నంత బాలేదని చెబుతున్నారు. రవితేజ మరోసారి నిరాశపరిచారని వారు పెదవి విరుస్తున్నారు. అదేవిధంగా స్టోరీ లైన్ వెరైటీగా ఉన్నా దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో సినిమాను రొటీన్‌గా మార్చేశారని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రొటీన్ రివేంజ్ డ్రామాకు సైన్స్ ఫిక్షన్ ముసుగేశారని విమర్శిస్తున్నారు.

ఇక సినిమాకి తమన్ మ్యూజిక్..ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక విలన్ గా బాబీ సింహా అదరగొట్టేశాడని చెబుతున్నారు. సునీల్ కు ఈ సినిమాలో మంచి పాత్ర దొరికిందని చెబుతున్నారు. అయన క్లైమాక్స్ లో తన నటనతో సినిమాకి మరింత హైప్ తెచ్చారని చెబుతున్నారు. మొత్తమ్మీద ట్విట్టర్ లో వస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రవితేజ మరో హిట్ కొట్టినట్టే కనిపిస్తోంది. మరి కొద్దీ సేపట్లో మనకి కూడా మార్నింగ్ షో రిజల్ట్ వచ్చేస్తుంది. అప్పుడు మరిన్ని విశేషాలు డిస్కోరాజా గురించి తెలుసుకోవచ్చు. అంత వరకూ ఈ ట్విట్టర్ అభిప్రాయాలపై మీరూ ఓ లుక్కేయండి!





Show Full Article
Print Article
More On
Next Story
More Stories