Live Updates:ఈరోజు (జూన్-04) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 04 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి (ఉదయం 06:05 వరకు), తదుపరి చతుర్దశి సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 4 Jun 2020 8:53 AM IST
విజయవాడలో వివాహిత ఆత్మహత్య
- విజయవాడ మునిసిపల్ ఆఫీస్ దగ్గర బందరు కాలువలో ఒక వివాహిత ఆత్మహత్య
- మృతురాలు నాగస్వరూప రాణి(30) పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మార్తా గ్రామంగా గుర్తింపు
- మృతురాలు తన ఇద్దరు పిల్లలతో కావాలనే ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చిందని చెబుతున్న పిల్లలు
- వివాహిత పిల్లలు ఊపిరాడక ఒడ్డుకు వచ్చారని తన తల్లి మాత్రం రాలేదని రోదిస్తున్న పిల్లలు
- ఈ మేరకు కేసును నమోదు చేసుకుని మృతురాలి కుటుంభ సభ్యులకు సమాచారం చేరవేత

- 4 Jun 2020 8:15 AM IST
- హైదరాబాద్ లో ఈరోజు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ..
- కృష్ణా నదీ జల వివాదాలపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, ఇంజనీర్లు.
- 4 Jun 2020 8:13 AM IST
- విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై ఈరోజు హైపవర్ కమిటీ విచారణ..
- సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ఛైర్మన్‌గా పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శి కరీకల్‌వలవన్..
- జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కేమీనా సభ్యులుగా హైపవర్ కమిటీ..
- ఇప్పటికే ప్రమాదంపై హైపవర్ కమిటీకి నివేదికలు అందించిన 5 కమిటీలు..
- కేంద్రం నియమించిన కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్న హైపవర్ కమిటీ..
- గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు..
- స్టైరిన్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణులు..

- 4 Jun 2020 6:57 AM IST
- తెలంగాణా లో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.
- బుధవారం 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,020కి పెరిగింది.
- నిన్న నమోదైన కేసుల్లో తెలంగాణవాసుల్లో 127 పాజిటివ్ కాగా, వలసకార్మికుల్లో 2 కేసులు ఉన్నాయి.
- తెలంగాణాలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలోనే 108 ఉన్నాయి.

- 4 Jun 2020 6:42 AM IST
ఈరోజు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభం 10,000 రూ ఆర్ధిక సాయం నేటి నుంచి బ్యాంకు అకౌంట్ లో కి జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం.




