Live Updates:ఈరోజు (జూన్-02) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 02జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 02జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఏకాదశి (మధ్యాహ్నం 12:04 వరకు), తదుపరి ద్వాదశి.సూర్యోదయం 5:40am, సూర్యాస్తమయం 6:47 pm.
Live Updates
- 2 Jun 2020 8:15 AM IST
- మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జ్ అనిరుద్ రెడ్డి హౌస్ అరెస్ట్.
- ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే జలదీక్ష కు అనుమతి నిరాకరణ.
- రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ లోని తన నివాసంలో గృహనిర్బంధం చేసిన రాజాపూర్ పోలీసులు.
- 2 Jun 2020 7:37 AM IST
నైరుతి వచ్చేసింది!
- చల్లటి కబురు వచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
- ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
- జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ సీజన్‌లో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు.
- 2 Jun 2020 6:48 AM IST
తెలంగాణా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!
తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈరోజు. తెలంగాణా ప్రజల కలలు సాకారమైన రోజు. సుదీర్ఘ ప్రజా పోరాటానికి ప్రజాస్వామ్య విజయం దక్కినరోజు. ఈ సందర్భంగా హెచ్ఎంటీవీ తెలంగాణా పోరాటం.. విజయం..రాష్ట్ర చరిత్ర..వివరాలతో అందించిన ప్రత్యెక కథనం..




