Top
logo

Live Updates:ఈరోజు (జూలై-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-26) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 26 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం షష్ఠి (ఉ.9-32 వరకు) తర్వాత సప్తమి, హస్త నక్షత్రం (మ. 12-37 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 8-06 నుంచి 9-36 వరకు) దుర్ముహూర్తం (సా. 4-57 నుంచి 5-49 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 26 July 2020 3:45 PM GMT

  సినీ నటుడు సొనూసూద్ కు చంద్రబాబు ఫోన్

  - సొనూసూద్ ను అభినందించిన చంద్రబాబు

  - కాడేద్దులుగా మరి కుమార్తెలే తండ్రికి పొలం పనులు సాయపదడంపై సొనూసూద్ స్పందించి ట్రాక్టర్ అందించడాన్ని అభినందించారు.  

 • 26 July 2020 3:09 PM GMT

  విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

  విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మహిళల నుంచి పిల్లల్ని తీసుకొని అమ్మకాలు చేస్తున్న ముఠాను విశాఖ నగర పోలీసులు పట్టుకున్నారు. పేదలను లక్ష్యంగా చేసుకొని పిల్లల అక్రమ రవాణా సాగుతోందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.

  - పూర్తి వివరాలు 

 • 26 July 2020 2:53 PM GMT

  కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పించిన ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు సభ్యులు

  ఒంగోలు: ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు మరియు ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్ ఆధ్వర్యములో ఆదివారం సాయంత్రం ఒంగోలు బండ్లమిట్ట మంగలిపాలెం కూడలి వద్దగల కార్గిల్ విజయస్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పించినారు.

  అమరవీరుల త్యాగాలను స్మరించుకొంటూ దేశ రక్షణలో తమవారిని వదలి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎండనక, వాననక చలిలో శతృమూకల చొరబాటును అడ్డుకొంటూ పహారాకాస్తున్న సైనికులను స్మరించుకోవడం మన కర్తవ్యమని ఎయిమ్స్ జాతీయ అధ్యక్షులు జంధ్యం రాధా రమణ గుప్తా ఉధ్గాటించారు.

  ఈ కార్యక్రమములో ఎయిమ్స్ క్లబ్స్ జాతీయ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, ఎయిమ్స్ ఒంగోలు కార్యదర్శి నేరేళ్ల శ్రీనివాసరావు, ధనిశెట్టి రాము, చలువాది గొవిందు, గుర్రం కృష్ణ, శెనెగెపల్లి నాగాంజనేయులు "ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు జూనియర్స్" అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ మీనాక్షి, మీనాశ్రీలు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
 • 26 July 2020 2:15 PM GMT

  అక్రమంగా తరలిస్తున్న గంజాయి లారీని పట్టుకున్న చిలకలూరిపేట అర్బన్ పోలీసులు

  చిలకలూరిపేట : 16 వ నెంబరు జాతీయ రహదారిపై చిలకలూరి పేట వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు ఆదివారం అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. టి ఎన్ 70 జె 4491 నంబరు గల వాహనం విశాఖపట్నం నుంచి చెన్నై వెళుతోంది.

  చిలకలూరిపేట పట్టణం లోని ఎన్ ఆర్ టి సెంటర్లో ఈ వాహనంపై అనుమానం వచ్చిన పోలీసులు దానిని అడ్డగించి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆ లారీని పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్దకు తీసుకువెళ్లారు.

  గుట్టుచప్పుడు కాకుండా మొక్కజొన్న రవాణా పేరుతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మొక్కజొన్న బస్తాల మధ్యలో 280 కేజీల గంజాయి, 2 కిలోల ప్యాకేట్స్ తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుందని అన్నారు.

  డ్రైవర్, క్లీనర్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని, ఇంకా సమాచారం రావాల్సి ఉందని అర్బన్ సీఐ టి.వెంకటేశ్వర్లు అన్నారు. • 26 July 2020 1:57 PM GMT

  పేకాట శిభిరంపై పోలీసులు దాడి

  జగ్గంపేట: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ పొలాల్లో ఆడుతున్న పేకాట శిభిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాట్రావులపల్లి గ్రామంలోని తోటల్లో పేకాట ఆడుతున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 4 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 వేల ముప్పై రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు జగ్గంపేట ఎస్ ఐ రామకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 • 26 July 2020 1:54 PM GMT

  రేపటి నుండి కడపలో లాక్ డౌన్

  కడప : నగరంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమ‌వారం నుంచి కఠినంగా లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు డీఎస్పీ సూర్య‌నారాయ‌ణ తెలిపారు. 27 నుంచి నగరంలో 10 గంటల లోపు దుకాణాలు తెరించేందుకు అనుమతి ఇస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

  10 గంటల తర్వాత దుకాణాలు మూసి వేయాలని ఆయ‌న సూచించారు. 10 గంటల తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగ కూడ‌ద‌ని దయచేసి కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఎవ‌రైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరించారు.

 • 26 July 2020 1:46 PM GMT

  ఉండబండలో నిరాడంబరంగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి క‌ల్యాణం

  విడపనకల్లు : విడపనకల్లు మండలం ఉండబండలో శ్రీ వీరభద్రస్వామి వారి ఉత్సవాల వేడుకలు నిరాడంబ‌రంగా జ‌రిగాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి రథోత్సవం రద్దు చేశారు. ఏటా అంగరంగ వైభవంగా జరిగే కల్యాణోత్సవం ఈసారి భక్తజనం లేకుండానే శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి సాదాసీదాగా నిర్వ‌హించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కమిటీ సభ్యులు స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కేవలం అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది. • 26 July 2020 1:44 PM GMT

  అనంతపురం జిల్లాలో కొత్తగా 734 కరోనా కేసులు నమోదు

  అనంతపురం: జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ రోజు ఆదివారం జిల్లాలో 734 కేసులు నమోదు కావటం జరిగినది.

  ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 9723 కు చేరుకుంది. ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 4926 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4714 గా ఉన్నది. ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 83 గా నమోదు అయింది.

 • 26 July 2020 1:09 PM GMT

  ఏపీలో కొత్తగా 7, 627 పాజిటివ్ కేసులు..

  - రాష్ట్రంలో గత 24 గంటల్లో 47, 645 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7, 627 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

  - కొత్తగా 3,041 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు.

  - నేటి వరకు రాష్ట్రంలో 16,43,319 సాంపిల్స్‌ ని పరీక్షించారు.

  - రాష్ట్రం లోని నమోదైన మొత్తం 96, 298 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 1,041 మంది మరణించారు.


 • 26 July 2020 12:24 PM GMT

  మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు.

  - పూర్తి వివరాలు 

Next Story