Mayor Bonthu Rammohan tests positive for coronavirus: మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

Arun Chilukuri
Published on: 26 July 2020 3:44 PM IST
Mayor Bonthu Rammohan tests positive for coronavirus: మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్
X

Mayor Bonthu Rammohan tests positive for coronavirus : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు.

గతంలో మేయర్ బొంతు రామ్మోహన్ రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సార్లూ ఆయనకు నెగటివ్ అని వచ్చింది. తాజాగా మూడోసారి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్‌ ఛాయ్‌ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్‌కు మూడో సారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story