Child Trafficking Bust in Visakhapatnam: విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

Child Trafficking Bust in Visakhapatnam: విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది.

Raj
By Raj
Updated on: 26 July 2020 8:56 PM IST
Child Trafficking Bust in Visakhapatnam:  విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
X

Child Trafficking Bust in Visakhapatnam: విశాఖలో పసిపిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మహిళల నుంచి పిల్లల్ని తీసుకొని అమ్మకాలు చేస్తున్న ముఠాను విశాఖ నగర పోలీసులు పట్టుకున్నారు. పేదలను లక్ష్యంగా చేసుకొని పిల్లల అక్రమ రవాణా సాగుతోందని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. పుట్టిన వెంటనే చిన్నపిల్లల్ని అమ్ముతున్నారని నగర సిపి తెలిపారు. కృష్ణానగర్ లోని ఇవిఎఫ్ నగర్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. గతంలోనూ సృష్టి ఆసుపత్రి మోసాలు వెలుగులోకి వచ్చాయి.

జూన్ లో ఈ కేసును చేపట్టిన పోలీసులు దీనిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. గత నెల 24 , 25 న ఇందుకు సంబంధించి రెండు కేసులు నమోదు అయ్యాయి. దాంతో పోలీసులు మరింత వేగం పెంచారు. అయితే ఎట్టకేలకు ఈ ముఠాను ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. వారికి డబ్బు ఆశచూపి వారివద్ద పిల్లల్ని తీసుకొని అమ్ముతున్నారు. దీంతో ఈ కేసును రహశ్యంగా చేధించారు పోలీసులు. ఇకనుంచి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ తెలిపారు.



Raj

Raj

Next Story