Top
logo

Live Updates:ఈరోజు (జూలై-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శనివారం, 25 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పంచమి (మ.12-02 వరకు) తర్వాత షష్టి, ఉత్తర నక్షత్రం (మ. 2-18 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 10-07 నుంచి 11-36 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-47 నుంచి 6-38 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 25 July 2020 1:44 PM GMT

  పీపీఈ కిట్లతో పెళ్లి భోజనం

  - కృష్ణ జిల్లా లో జరిగిన పెళ్ళిలో బంధువులు పీపీఈ కిట్లు దరించి విందుకు హాజరయ్యారు.

  - ఇది చుసిన బంధువులు బిత్తర పోయారు. పెళ్లి వరకు మాములుగా జరిగితే అందులో వింతేముంది..

  - పెళ్ళికి వచ్చిన వారికీ భోజనం వడ్డించే దగ్గరే విచిత్రం చోటుచేసుకుంది.

  - బోజనాలు పూర్తయే వరకు కాట్టేరింగ్ బాయ్స్ పీపీఈ కిట్లు దరించి బోజనాలువడ్డించారు.


 • 25 July 2020 6:49 AM GMT

  మధ్యప్రదేశ్ సిఎం కు కరోనా పాజిటివ్

  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది;


 • 25 July 2020 4:26 AM GMT

  ఇంటర్ మార్పులపై అభిప్రాయ సేకరణ

  కరోనా వైరస్ విలయంలో అన్ని చోట్లా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు విద్యా విధానంలో సైతం మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రధానంగా ఏపీలో ఇంటర్ విద్యలో గత మాదిరి కాకుండా యూనిట్ టెస్ట్ లు నిర్వహించి, ఎప్పటికప్పుడు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఇంట‌ర్ విద్యా విధానంలో స‌మూల మార్పుల‌కు ఏపీ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతోంది. ఇక‌పై ఇంటర్మీడియట్‌లో యూనిట్‌ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు రెడీ చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.

  సబ్జెక్టుకు ఒక వర్క్‌బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు అనుగుణంగా మ‌ల్టిపుల్ ఛాయిస్ క్వ‌చ్చ‌న్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.


 • 25 July 2020 4:24 AM GMT

  పదిరోజుల్లో రైతులందరికీ పాసుపుస్తకాలు..

  సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచులు వెంకట్‌రాంరెడ్డి, చంద్రశేఖర్‌లతో శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 4:23 AM GMT

  వివాహ భోజనం ఇళ్లకే..

  పెళ్లి... ఆ తంతునే తూతూ మంత్రంగా మార్చింది కరోనా... నలుగురిని పిలుచుకునేందుకు లేదు.. నలుగురికి భోజనం పెట్టుకునేందుకు లేదు..ప్రస్తుత మాదిరి చేస్తే అధికారులే కేసులు పెడతారు.. ఇలాంటి సమస్యలు లేకుంగా చేయాలంటే ఒక్కటే మార్గం.. పరిమిత సంఖ్యలో పరిధిలో వివాహం జరపడం... పెళ్లి భోజనాన్ని ఇళ్లకే పంపడం... ఈ విధంగా కొత్త విధానానికి తెరతీశారు. విశాఖ వాసులు..

  - పూర్తి వివరాలు 


 • 25 July 2020 3:34 AM GMT

  బంగారం చోరి కేసును చేధించిన పోలీసులు..

  తను అనుకున్నట్టు బంగారాన్ని దోచేశాడు. వాటిని నిరూపించే సీసీ పుటేజీని లేకుండా చేశాడు. అయితే అదే షాపులో వేరొకరి వేలిముద్రలు లేకుండా ఉన్న విషయాన్ని మాత్రం మరిచాడు. అందుకే పోలీసులకు దొరికిపోయాడు.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 3:32 AM GMT

  వర్క్ ఫ్రం హోంకు అనుగుణంగా చర్యలు..

  కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మేకపాటి ఆదేశాలు జారీ చేశారు. వీరికి అవసరమైన నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీసులను ఏర్పాటు చేయాలన్నారు. అవసరాన్ని బట్టి ఉచితంగా అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 3:31 AM GMT

  ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలకు షాక్..

  ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలు కమీషన్ కు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలుకాదని వెల్లడించింది. పలు డిమాండ్లతో కమీషన్ ను ఆశ్రయించిన ప్రైవేటు సంస్థలకు చుక్కెదురైంది. ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్‌ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్‌ కాస్ట్‌) ఇవ్వాలంటూ ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్‌ను కమిషన్‌ తోసిపుచ్చింది.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 3:29 AM GMT

  ఇంటి నుంచే లైసెన్సులు..

  కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుండటంతో పలు శాఖల్లో పనితీరును మార్చుకోవాల్సి వస్తోందనడానికి ఇదే నిదర్శనం. వాహనాలకు సంబంధించిన లైసెన్స్ లు, ఇతర డ్రైవింగ్ లైసెన్స్ లు పొందాలంటే ఇంతవరకు ముందు నేరుగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి పొందాల్సి ఉండేది. దానికి భిన్నంగా కరోనా వల్ల ఇంటి నుంచి పొందే వీలుని తెలంగాణా ప్రభుత్వం కల్పించింది.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 2:24 AM GMT

  కరోనా కట్టడికి రూ. 1,000కోట్లు కేటాయింపు..

  గత వారం రోజులుగా ఏపీలో కేసుల తీవ్రత చూస్తే ఆందోళన వేస్తోంది. దీని నుంచి బయట పడాలంటే వీలైనంత మేర వైద్యం అందించేందుకు సేవలను పెంచాలి. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. రాబోయే అరునెలల్లో కరోనా నివారణకు ఖర్చు చేసేందుకు రూ. 1,000కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

  - పూర్తి వివరాలు 

Next Story