Top
logo

Live Updates:ఈరోజు (జూలై-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూలై-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శనివారం, 25 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పంచమి (మ.12-02 వరకు) తర్వాత షష్టి, ఉత్తర నక్షత్రం (మ. 2-18 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 10-07 నుంచి 11-36 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-47 నుంచి 6-38 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 25 July 2020 3:45 PM GMT

  తునిలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదు

  తుని: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తలు వహించాలని తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు విజ్ఞప్తి చేశారు.

  తాజాగా బ్యాంక్ కాలనీ మార్కేండ్రాజుపేట ముక్త లింగయ్య వీధిలతో పాటూ పలు ప్రాంతాల్లో సుమారు 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.

 • 25 July 2020 3:39 PM GMT

  కషాయం తాగండి.. కరోనాను జయించండి

  సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌, మెగా కంపెనీ సహకారంతో కషాయ వితరణ కేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత కషాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 3:21 PM GMT

  తాడిపత్రిలో 36 గంటలు పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన పోలీస్, మున్సిపల్ అధికారులు

  తాడిపత్రి: పట్టణంలో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 36 గంటలు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఆర్ల శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రి పట్టణం పరిసర ప్రాంతాల్లో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో, ఈ లాక్ డౌన్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. 

 • 25 July 2020 3:19 PM GMT

  రోగుల పట్ల నిర్లక్ష్యం వద్దు: జాయింట్ కలెక్టర్

  అనంతపురం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదని, జాయింట్ కలెక్టర్ ( గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) డా.ఏ.సిరి ఆదేశించారు. శనివారం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పలు విభాగాలను జెసి పరిశీలించారు.

  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఏ సమయంలో ఏ పేషెంట్ వచ్చినా వారికి గైడ్ చేయాలని, రాత్రి సమయంలో ఎవరు వచ్చినా ఆస్పత్రిలో ఏ విభాగం ఎక్కడ ఉంది, స్ట్రెచర్స్ ఎక్కడ ఉన్నాయి, ఓపి ఎక్కడ ఉంది, క్యాజువాలిటీ వార్డు ఎక్కడ ఉంది అనే విషయాలను పేషెంట్లకు చెప్పేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.

  రాత్రిపూట ఆసుపత్రికి వచ్చే వారిని జాగ్రత్తగా చూసుకోవాలని, షిఫ్ట్ ల ప్రకారం సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో జాగ్రత్తగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ ఆర్ఎంఓ విజయ, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  • 25 July 2020 2:42 PM GMT

  యడియూరప్పకు కోర్టు సమన్లు

  ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని కర్ణాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్‌ యడియూరప్పకు కోర్టు సమన్లు జారీ చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. 2019లో గోకక్‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన‌ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నియమావళిని ఉల్లంఘించారంటూ పిటిష‌న్‌ దాఖలైంది. ఈ పిటిష‌న్‌పై గోకక్‌‌లోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ విచార‌ణ చేపట్టింది. ఈ క్రమంలో సీఎం యడియూరప్పకు న్యాయ‌స్థానం స‌మ‌న్లు జారీ చేసింది.

  - పూర్తి వివరాలు 

 • రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ
  25 July 2020 2:12 PM GMT

  రేషన్ డీలర్స్ సమస్యల పై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ నేత కన్నా లేఖ

  - రేషన్ డీలర్స్ సమస్యల పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్ కు లేఖ.

  - రాష్ట్రంలో రేషన్ షాప్ డీలర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

  - రేషన్ డీలర్స్ లో ఎక్కువ మంది తక్కువ ఆదయ వర్గాలు ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవరున్నారని.. ఈ దుకనలని స్వయం ఉపాదిగా తీసుకున్నారని తెలిపారు.

  - రేషన్ షాప్ లు ప్రజా పంపిణీ వ్యవస్తలోకుడా కీలకమని లేఖలో వెల్లడించారు. 


 • 25 July 2020 2:04 PM GMT

  తెనాలి ఆస్పత్రిలో నర్సుల ఆందోళన

  - గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఆందోళన. మాస్క్ లు, గ్లౌస్లు, పీపీఈ కిట్లు సరిపడినంత అందటం లేదంటూ ఆగ్రహం.

  - ఆసుపత్రి ఎదుట నుర్సుల నిరసన.

  - మౌలికసదుపాయాలు కల్పంచాలంటూ డిమాండ్.

  - ఫ్రంట్ లైన్ వారిఎర్స్ ను ఎవరూ పట్టించ్చుకోవటం లేదని.. ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు దిక్కెవరు అంటూ కన్నీరు పెట్టినంత పనిచేసారు. 

 • 25 July 2020 1:49 PM GMT

  ఆదిలాబాద్ ఏజెన్సీలో వణికిస్తున్న విషజ్వరాలు

  గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు గిరిజనులను వెంటాడుతున్నాయి. ఆదివాసుల నివాసాల్లో రాకాసి రోగాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా భయంతో అల్లాడుతుంటే మరోవైపు విషజ్వరాలు గిరిజనుల పాలిట శాపంగా మారాయి.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 1:48 PM GMT

  క‌రోనా టెస్ట్‌ల‌ను పెంచండి

  దేశంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తుంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా త‌న పంజాను విసురుతుంది. నిన్న (శుక్రవారం) కొత్త‌గా దాదాపు 50వేల కేసులు న‌మోద‌య్యాయి. 775 మంది వైరస్‌ మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 13.37 లక్షలకు చేరింది.

  మరణాల సంఖ్య 31,406కి చేరింది. అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి 8.50 లక్షల మంది బాధితులు కోలుకోగా.. మరో 4.50 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  - పూర్తి వివరాలు 

 • 25 July 2020 1:46 PM GMT

  అక్రమ పట్టా ఉపసంహరణపై ధర్నా

  - కొమరం భీం జిల్లా చిన్తమనేరు తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళనకు దిగారు.

  - తమ భూమిని ఇతరులకు పట్టా ఇచ్చారని ఆరోపించారు.

  - తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు.

  - అక్రమంగా పట్టా చేయించుకున్న ఉప సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Next Story