Live Updates:ఈరోజు (జూలై-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 25 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం పంచమి (మ.12-02 వరకు) తర్వాత షష్టి, ఉత్తర నక్షత్రం (మ. 2-18 వరకు) తర్వాత హస్త నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 10-07 నుంచి 11-36 వరకు) దుర్ముహూర్తం (ఉ. 5-47 నుంచి 6-38 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 25 July 2020 2:22 AM GMT

    ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలకు షాక్..

    ధరల పెంపుపై ప్రైవేటు విద్యుత్ సంస్థలు కమీషన్ కు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీలుకాదని వెల్లడించింది. పలు డిమాండ్లతో కమీషన్ ను ఆశ్రయించిన ప్రైవేటు సంస్థలకు చుక్కెదురైంది. ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో కీలక తీర్పు వెలువరించింది.

    - పూర్తి వివరాలు 

  • కరోనా కోరల్లో తెలుగు రాష్ట్రాలు విల విల!
    25 July 2020 1:42 AM GMT

    కరోనా కోరల్లో తెలుగు రాష్ట్రాలు విల విల!

    తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. తాజాగా.. తెలంగాణ గత 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఎనిమిది మంది చనిపోయారు. 1,007 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,466కి చేరుకోగా, మరణాల సంఖ్య 447కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,334 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,677 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,147 కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 2,380 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,858కి చేరింది. వీరిలో కరోనా నుంచి 39,935 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 933 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 39,990 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

Print Article
Next Story
More Stories