Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Oct 2020 5:38 PM IST
Srinivas Goud Comments: దేశంలో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోన్నది తెలంగాణ ప్రభుత్వమే...
శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్:
* అగ్రి డాక్టర్ వ్యవస్థను ప్రవేశ పెట్టింది మా ప్రభుత్వమే...
* గతంలో దళారుల చేతిలో రైతన్నలు దారుణంగా మోస పోయేవారు...
* దలారులు మాత్రం కోట్లకు పడగలెత్తారు...
* కానీ మా ప్రభుత్వం దళారి వ్యవస్థను రూపుమాపెందుకు నేరుగా ప్రభుత్వమే రైతు నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది...
* నియంత్రిత వ్యవసాయం క్రింద మక్క వేయొద్దంటే రైతులు వేశారు... అయినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర ఇస్తూ మక్కా కొనేందుకు ముందుకు వచ్చింది...
* జిల్లాలో వరి కొనుగోలుకు 190 కేంద్రాలు ఏర్పాటు చేసాం...
* వచ్చే వర్ష కాలానికి పంట మార్పిడి చేసేలా అదికారులు రైతులను సన్నద్ధం చేయాలి...
* తెరాస అధికారంలో ఉన్నంత వరకు సీఎం రైతు బంధు ఇస్తామన్నారు...
- 31 Oct 2020 5:34 PM IST
Hyderabad Updates: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసుమాముల లో ఇల్లు లూటీ చేసిన దొంగలు...
హైదరాబాద్...
- పసుమాముల గ్రామంలో బాబు గౌడ్ ఇంట్లో చోరీ..
- 2 లక్షల నగదు,15 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు...
- ఇంటికి తాళం వేసి ఫంక్షన్ కు వెళ్లిన బాబు గౌడ్..
- తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం ను పగులగొట్టి దోచుకెళ్లిన దుండగులు..
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- 31 Oct 2020 5:31 PM IST
Adilabad Updates: జల్ , జంగల్, జమీన్ కోసం కొమరం భీమ్ అసువులు బాసాడు..
ఆదిలాబాద్ జిల్లా....
* ఆదిలాబాద్ కొమరం భీమ్ వర్థంతి సభలో ఎమ్మెల్యే రామన్న. కామెంట్స్
* గిరిజన ప్రాంతాలలో సాగునీరు అందించడానికి చెరువులు, కుంటలు తవ్విస్తాం
* గిరిజన గూడాల అభివృద్ధి కోసం చిన్న పంచాయితీలను ఏర్పాటు చేశారు
* గిరిజన సమస్యలను పరిష్కరించడానికి సర్కార్ సిద్దంగా ఉంది..
* గిరిజన సమస్యల పరిష్కారం కోసం అదివాసీల బ్రుందాన్ని ముఖ్యమంత్రి దగ్గర కు తీసుకవెళ్లుతాం..
* కరోనా తీవ్రత తగ్గానే సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ పర్యటిస్తారు
* పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తాం
- 31 Oct 2020 4:58 PM IST
Hyderabad Updates: ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య...
హైదరాబాద్...
* హైదరాబాద్ లో ఆఫర్ల తో పెరిగిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
* మెట్రో ప్రయాణికుల కోసం సువర్ణ ఆఫర్ ప్రారంభించిన హెచ్ ఎమ్మార్
* ప్రతి రోజు లక్షా 30 వేల మంది ప్రయాణిస్తున్నారు
* మెట్రో స్మార్ట్ కార్డు రిచార్జి పై 50 శాతం క్యాష్ బ్యాక్
- 31 Oct 2020 10:31 AM IST
Jangaon District Updates: సీఎం పర్యటన వేళా ప్రతిపక్షాల నేతల అరెస్టుల పర్వం..
జనగామ జిల్లా:
// జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపి,ఎమ్మార్పీఎస్, గొర్ల కాపరులు సంఘం నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు..
// సీఎం రోడ్డు మార్గం గుండా వస్తుండడంతో కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు..
// పెంబర్తి తోరణం మీదగా.. కొడకండ్ల రైతు వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం కేసీఆర్..
// అరెస్టులను ఖండిస్తున్న ప్రతిపక్షాలు...
- 31 Oct 2020 10:23 AM IST
Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ వరద ఉదృతి...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-12 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 96,80 మీటర్లు
-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 14,100 క్యూసెక్కులు
- 31 Oct 2020 10:20 AM IST
Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ కి తగ్గుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా...
-గేట్లు మూసిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.05 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.65 టీఎంసీ
-ఇన్ ఫ్లో 7000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 0 క్యూసెక్కులు
- 31 Oct 2020 9:44 AM IST
Siddipet Updates: సిద్దిపేట , దుబ్బాక టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్లలో సోదాలు...
సిద్దిపేట...
- ఏక కాలం లో 8 మంది టి ఆర్ ఎస్ నాయకుల ఇండ్ల లో సోదాలు జరిపిన పోలీస్ లు..
- దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు..
- ఈ సోదాల్లో ఎవరి ఇంట్లో కూడా ఏమి దొరకలేదు..
- 31 Oct 2020 8:38 AM IST
Kamareddy District Updates: జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు...
కామారెడ్డి :
* భిక్కనుర్ మండల కేంద్రము లో జెండగల్లి లో పిచ్చి కుక్క దాడి ఎనిమిది మంది కి గాయాలు
* రోహిత్ అనే నాలుగు సంవత్సరాల బాలుడికి తీవ్ర గాయాలు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలింపు.
- 31 Oct 2020 8:17 AM IST
Jangaon District Updates: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన...
జనగామ జిల్లా..
* పాలకుర్తి నియోజవర్గం పరిధిలోని కొడకండ్లలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..
* హైద్రాబాద్ (బేగంపేట) నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా
* 12:30గంటలకు కొడకండ్ల కు చేరుకుంటారు.
* 12:40 నివిుషాలకు.కొడకండ్ల గ్రామంలో ఉన్న రైతు వేదికను ప్రారంభిస్తారు.
* 12:50నివిుషాలకు పల్లెప్రకృతివనాని సందర్శిస్తారు
* అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో 5000 మ౦ది రైతులతో సమావేశంలో పాల్గొంటారు..
* సభ అనంతరం మండల పార్టీ కొడకండ్ల లోనే మధ్యాహ్న భోజనం..
* అనంతరం తిరిగి హైదరాబాద్ కు పయనం..













