Live Updates: ఈరోజు (31 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 31 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పూర్ణిమ రా.7-02 తదుపరి బహుళ పాడ్యమి | అశ్విని నక్షత్రం సా.5-51 తదుపరి భరణి | వర్జ్యం మ.1-25 నుంచి 3-11 వరకు తిరిగి తె. 4-29 నుంచి | అమృత ఘడియలు ఉ.9-52 నుంచి 11-39 వరకు | దుర్ముహూర్తం ఉ.6-01 నుంచి 7-32 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Oct 2020 2:34 PM GMT
Kamareddy Updates: జెండా గల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం...
కామారెడ్డి :
* బిక్నూర్ మండల కేంద్రంలోని జెండా గల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం
* 7 మంది చిన్నారులకు 3గురు వృద్దులకు గాయాలు
* ముగ్గురికి తీవ్రగాయాలు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు
* పిచ్చికుక్కలను తరలికొట్టాలని కాలని వాసుల ఆందోళన
- 31 Oct 2020 2:24 PM GMT
K. T. Rama Rao: వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాము...
# ప్రతి ఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయం తప్పకుండా అందుతుంది -మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్
# వరదల్లో నష్టపోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
# పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయి
#ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించైనా అర్హులైన అందరికీ తక్షణ సహాయం అందేలా చూస్తాం
# రేపు జిహెచ్ఎంసి మరియు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం తో సమీక్ష నిర్వహిస్తాను
#వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు
- 31 Oct 2020 2:19 PM GMT
Warangal Urban Updates: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల...
వరంగల్ అర్బన్:
- డిసెంబర్ 1 నుండి 8 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు...
- కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం. ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని కోరిన యూనివర్సిటీ వర్గాలు..
- 31 Oct 2020 2:14 PM GMT
Choutuppal Updates: ASI రంగాచారి, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ ల సస్పెండ్!
యాదాద్రి భువనగిరి జిల్లా:-
- చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నుండి అక్టోబర్ 27న దొంగ పారిపోయిన ఘటనలో..
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన ASI రంగాచారి, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ లను సస్పెండ్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్
- 31 Oct 2020 2:11 PM GMT
GHMC Updates: ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం...
జీహెచ్ఎంసీ...
* నవంబర్ ఏడో తేదీన ఓటర్ జాబితా ముసాయిదా ప్రకటన, 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
* తొమ్మిదో తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ సమావేశం
* పదో తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్కిళ్ల స్థాయిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల సమావేశం
* 13 వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటన
* జిహెచ్ఎంసి ప్రస్తుత పాలకమండలి గడువు 10 ఫిభ్రవరి 2021 తో ముగింపు
* ఈలోగానే ఎన్నికలు నిర్వహిస్తాం, అందుకు అన్ని చర్యలు చేపడతున్నాం, రాష్ట్ర ఎన్నికల కమీషనర్,పార్థసారధి.
- 31 Oct 2020 2:08 PM GMT
Siddipet Updates: చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
సిద్దిపేట :
-దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
-పాల్గొన్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి...
- 31 Oct 2020 1:38 PM GMT
Bhadradri Kothagudem district: ఇద్దరు మావోయిస్టు లు అరెస్ట్...
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
* మావోయిస్టు మణుగూరు ఏరియా లోకల్ గెరిల్లా కమాండర్ మడవి మంగాలు,మడకం దేశి లు అరెస్ట్.
* ఏడూ ళ్ల బయ్యారం ఏరియా
* తిర్లాపురం అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి తుపాకి,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన
* జిల్లా SP సునీల్ దత్.
- 31 Oct 2020 1:32 PM GMT
Malkajgiri Updates: సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
రేవంత్ రెడ్డి... మల్కాజ్ గిరి ఎంపీ.
-గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేశాయి .
-శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా... వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకున్నారు .-
-మీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే... వీళ్లు మనుషులేనా, మానవత్వం ఉందా అనిపిస్తోంది.
- గ్రేటర్ లో ఓట్లు దండుకోవాలన్న మీ దుర్భుద్ధే ఈ కుంభకోణానికి కారనం.
-చిత్తశుద్ధి ఉంటే పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు.
-మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది.
-రెండు రోజుల్లో తిరిగి పరిహారం పంపిణీ మొదలు పెట్టాలి.
-ఇప్పటి వరకు జరిగిన దోపిడీ పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి.
-లేదంటే క్షేత్ర స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం
- 31 Oct 2020 1:27 PM GMT
Nacharam Updates: నాచారం పిఎస్ పరిధిలో బాలుడి అమ్మకం కేసులో నిందితుల రిమాండ్...
నాచారం..
-అమ్మకం చేసిన మీనా, వెంకటేష్ దంపతులను, కొనుగోలు చేసిన రాజేష్ ను, మధ్యవర్తి జానకిని రిమాండ్ చేసిన పోలీసులు..
-మీనా, జానకికి చంచల్ గూడ జైల్ కు తరలింపు..
-వెంకటేష్, రాజేష్ లను చర్లపల్లి జైలు కి తరలించిన అధికారులు..
- 31 Oct 2020 12:32 PM GMT
Indrasena Reddy Comments: ఆరేళ్ళల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిందేంటో చెప్పాలన్న ఇంద్రసేనారెడ్డి..
ఇంద్రసేనారెడ్డి....బీజేపీ సీనియర్ నేత.
-దుబ్బాకలో బీజేపీ గెలిచేది లేదు.. పీకేది లేదనటాన్ని ఖండింస్తున్నాం
-దుబ్బాకలో మీటింగ్ పెట్టే దమ్ములేకనే .. ధరణి, రైతువేదికల పేరుతో సమావేశాలు పెడ్తున్నారు
-దుబ్బాకలో గెలుపుపై మంత్రి హరీష్ రావుకు ఆశలు సన్నగిల్లాయి
-రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న హరీష్ మాటలే ఇందుకు నిదర్శనం
-సభ్యత్వ సంస్కారం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు మీ నాన్నకు సంస్కారం నేర్చించు
-మక్కలు కొనటానికి కూడా కేంద్రమే నిధులిస్తోంది.
-కేంద్త నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తోంది
-గొల్ల కుర్మలను సీఎం కేసీఆర్ మోసం చేశాడు
-అప్పు పుట్టే స్థాయిని కేసీఆర్ పోగొట్టుకున్నాడు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire