Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Sept 2020 10:55 AM IST
Vijayawada updates: సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు..
విజయవాడ..
-వ్యవసాయ శాఖామంత్రి సీదిరి అప్పల్రాజు కార్యాలయానికి వచ్చిన వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష అభ్యర్ధులు
-ఈనెల 26న జరిగిన సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు
-6858 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 1938 మంది వెటర్నరీ అసిస్టెంట్ అభ్యర్ధులు
-మొత్తం ప్రశ్నలలో 95% వెటర్నరీకి సంబంధం లేని ప్రశ్నలు ఇచ్చారని ఆరోపణ
-డాక్టర్లు చదివే సిలబస్ ఇవ్వడంతో పరీక్ష రాయడం ఇబ్బంది అయిందని ఆరోపణ
-నోటిఫికేషన్ లో తెలిపిన 20యూనిట్లలోంచి ప్రశ్నలు రాలేదు
-కృష్ణ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచీ వచ్చిన అభ్యర్ధులు
-పరీక్ష రాయడానికి ఔట్ ఆఫ్ సిలబస్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వినతి
-పోస్టులు ఎక్కువ ఉన్నాయి కనుక పరీక్షకు హాజరైన అభ్యర్ధులందరికీ అవకాశం ఇవ్వాలని డిమాండ్
- 30 Sept 2020 10:50 AM IST
Amaravati updates: రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల సమావేశం..
అమరావతి..
-తుంగభద్ర పుష్కరాల పై విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో కర్నూల్ జిల్లా మంత్రులు,మునిసిపల్,
-తుంగభద్ర పుష్కరాల ను పకడ్పందిగా నిర్వహించాలని భావిస్తూన్న ప్రభుత్వం.
-కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాట్లు పెంపు లాంటి పలు అంశాలపై చర్చ.
- 30 Sept 2020 10:47 AM IST
Visakha updates: సైబర్ నేరగాళ్ల మాయ..
విశాఖ..
-నౌకాదళ విశ్రాంత అధికారికుచ్చుటోపీ..
-బహుమతి వచ్చిందంటూ రూ.1.60 కోట్లు వసూలు
-అదికమొత్తం లో నగదు బదిలీలు కావడంతో ఎంక్వయిరీ చేసిన సిబిఐ
-బాధితుడు ఫోన్ కాల్ చేసి వివరాలు అడిగిన సిబిఐ
-వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం
-సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు
- 30 Sept 2020 10:40 AM IST
Visakha updates: గాలికొండ ఏరియా సభ్యుడు మావోయిస్టు హరి అరెస్టు..
విశాఖ..
-హరిపై 50కేసులు
-4లక్షల రివార్డ్
-గాలికొండ ఏరియాలో కీలకంగా మారిన హరి అరెస్టు తో మావోయిస్టులకు గట్టి దెబ్బ
- 30 Sept 2020 10:36 AM IST
Amaravati updates: ఈరోజు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల ప్రకటన...
అమరావతి..
-రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు
-ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం
-ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించనున్న కార్పొరేషన్లు
-మొత్తం 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
-30 వేల పైబడి జనాభా ఉన్నవారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు
-మహిళలకు 50 శాతానికిపైగా పదవులు ఇచ్చే అవకాశం
- 30 Sept 2020 10:11 AM IST
Vijayawada updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గు ముఖం పడుతున్న వరద..
విజయవాడ..
-విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గు ముఖం పడుతున్న వరద ప్రవాహం
-ఇన్ ఫ్లో లక్షల 35వేల కూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షల 29వేల కూసెక్కులు
-కృష్ణా డెల్టా కాల్వలకు 3వేల కూసెక్కుల విడుదల
-మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్న అధికారులు
- 30 Sept 2020 10:04 AM IST
Tirumala updates: తిరుపతి ప్రధాన అర్చకునికి ఆరు నెలల జైలు శిక్ష...
తిరుపతి...
-సంచలనం రేకెత్తించిన ఆలయ నగలు తాకట్టు పెట్టిన కేసులో ప్రధాన అర్చకునికి ఆరు నెలల జైలు శిక్ష
-ప్రధాన అర్చకులు ఏ.వెంకటరమణ దీక్షితులుకు ఆరు నెలలు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్సు జడ్జి వై. వీర్రాజు తీర్పు
-గతంలో కేసు విచారించిన మూడో అదనపు మున్సిప్ కోర్టు..
-వెంకటరమణ దీక్షితులుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించిందగా అప్పీలు కు వెళ్ళిన దీక్షితులు
-మూడో అదనపు జిల్లా సెషన్సు కోర్టులో వాదోపవాదనల అనంతపురం తుది తీర్పు
-నిందితుడు ఎ.వెంకటరమణ దీక్షితులును 2009 ఆగస్టు 21న ఆలయ నగలు తాకట్టు పై తితిదే విజిలెన్సు అధికారులు తిరుపతి పడమర పోలీసు స్టేషన్లో కేసు నమోదు..
- 30 Sept 2020 10:00 AM IST
Dowleswaram Barrage updates: ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల..
తూర్పుగోదావరి..
-గోదావరిలో ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 3లక్షల 52వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల
-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 10.50 అడుగుల నీటిమట్టం
-డెల్టా పంటకాల్వలకు 11వేల 500 క్యూసెక్కులు విడుదల
- 30 Sept 2020 9:50 AM IST
Amaravati updates: ఏపీటీఎస్ కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష..
అమరావతి..
-ఉదయం 11గం.లకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఐ.టీ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష
-మధ్యాహ్నం 12గం.లకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష
-సాయంత్రం 4.30గం.లకు విజయవాడ కానూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమవనున్న 'కైనెటిక్ గ్రీన్' ప్రతినిధులు
-సాయంత్రం 5.30గం.లకు విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా "1000 మంది ఉద్యోగుల సంస్థగా అవతరించిన హెచ్ సీఎల్ టెక్నాలజీస్" సమావేశంలో మాట్లాడనున్న ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి
- 30 Sept 2020 9:46 AM IST
Nellore District updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం...
నెల్లూరు :--
-- ఇన్ ఫ్లో 42 వేల క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 39 వేల క్యూసెక్కు లు.
-- ప్రస్తుత నీటి మట్టం 73.998 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు













