Live Updates: ఈరోజు (సెప్టెంబర్-30) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 30 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 30 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చతుర్దశి: రా.11-29 వరకు తదుపరి పౌర్ణిమ | పూర్వాభాద్ర నక్షత్రం రా.1-41వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: ఉ.8-28 నుంచి 10-12 వరకు | అమృత ఘడియలు: సా.6-49నుంచి 7-46 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-32 నుంచి 12-31 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-50
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 30 Sept 2020 9:40 AM IST
Amaravati updates: ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‍పై నేడు తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు..
అమరావతి :
-మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‍పై నేడు తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు
-ఈ నెల 8న విచారణ ముగించి తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు
- నేడు హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం
-సినీ నిర్మాత అశ్వనీదత్ వేసిన పిటిషన్ ను విచారించనున్న హై కోర్టు
- గన్నవరం విమానాశ్రయం విస్తరణకు తాను ఇచ్చిన 40 ఏకరాల భూమికి భూ సేకరణ కింద 4 రెట్ల పరిహారం కోరుతున్న అశ్వనీదత్
- 30 Sept 2020 7:32 AM IST
Srisailam Project updates: శ్రీశైలం జలాశయంలో కొనసాగుతున్న వరద..
కర్నూలు జిల్లా....
-5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో : 1,23,258 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 1,70,097 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు
-ప్రస్తుతం : 884.50 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
-ప్రస్తుతం: 212.9198 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 30 Sept 2020 7:29 AM IST
Anantapur rain updates: పెద్ధవడూగూరు లో కుండపోత వర్షం..
అనంతపురం:
-వర్షం దాటికి ఉదృతంగా ప్రవహిస్తున్న పందలాకు వాగు.
-వాగులో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనము సురక్షితంగా బయటపడిన వాహనదారులు..
-అదే వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన స్థానికులు. బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు.
- 30 Sept 2020 7:26 AM IST
Anantapur updates: గుత్తి లో ఘరానా మోసం!
అనంతపురం:
-మేలిమి బంగారం తక్కువకు ఇస్తామంటూ కడప జిల్లా మైదుకూరు కు చెందిన సుబ్బరాయుడు తెలిపిన ఆగంతకులు
-అరకేజీ మేలిమి బంగారం ఉందని గుత్తి ఆర్ ఎస్- చెట్నే పల్లి మధ్య రైల్వే వంతెన వద్దకు రావాలని పిలుపు.
-తన సోదరులు, స్నేహితులతో గుత్తి కి వచ్చిన సుబ్బరాయుడు.
-ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు ఆగంతకులు సుబ్బరాయుడు తో ఉన్న డబ్బుల సంచి లాక్కొని పరారీ.
--వెంబడించిన దొరకని ఆచూకీ. పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు







