Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Aug 2020 12:02 PM IST
Kadapa district updates: బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల....
కడప :
-బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగునీరు విడుదల
-సాగునీరు విడుదల చేసిన
-కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ.గోవింద రెడ్డి.
- 28 Aug 2020 11:59 AM IST
Anantapur district updates: జే ఈఈ, నీట్ తో సహా అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ప్రకటించిన పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్.
-అనంతపురం: జే ఈఈ, నీట్తో సహా అన్ని పరీక్షలను బేషరతుగా వాయిదా వేయాలి.
-పరీక్షల తో విద్యార్థుల ప్రమాదం ఉంది.
-ప్రభుత్వం ప్రతిష్టాత్మకు పోకుండా పరీక్షలు రద్దు చేసి ప్రాణాలు కాపాడాలి
-రాష్ట్రంలో పాఠశాలలు ఏ విధంగా ప్రారంభిస్తారు
-పిల్లలకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో స్కూళ్లను ఏ రకంగా నడుపుతారు
-విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా..పిల్లల తండ్రిగా రాజకీయ నేతగా చెబుతున్నా..
-ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నా రాష్ట్రంలో పాఠశాల ప్రారంభం ఆలోచించండి
సైంటిఫిక్ గా విద్యా సంవత్సరంలో ఏ రకంగా నడపాలో... ఆలోచించండి.
-ఇప్పటికే పోలీసు సహా అన్ని శాఖలకు కరోనా వ్యాధి చెందుతుంది
-పిల్లల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
-:పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్.
- 28 Aug 2020 11:48 AM IST
Chittoor district updates: పలమనేరులో ఉద్రిక్తత....
చిత్తూరు....
-పలమనేరులో ఉద్రిక్తత
-మాజీ మంత్రి అమరనాథ రెడ్డి హౌస్ అరెస్టు
-పుంగనూరు నియోజకవర్గం సోమలలో దళిత యువకుడి అనుమానాస్పద మృతిపై ఆ గ్రామానికి బయలుదేరిన అమర్ నాధ రెడ్డి
-మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం కావడంతో ఉద్రిక్తత
-ప్రభుత్వ మద్యం పాలసీకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రని, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దళిత యువకుడు అనుమానాస్పద మృతి
-వైసిపి నాయకుల బెదిరింపుల వల్లే చనిపోయాడని టిడిపి ఆందోళన
-పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలో కొనసాగుతున్న ఉద్రిక్తత
- 28 Aug 2020 10:50 AM IST
Nellore district updates: బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పై కరోనా ప్రభావం..
నెల్లూరు/స్క్రోలింగ్:--
-- బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పై కరోనా ప్రభావం.
-- వెలవెలబోతున్న స్వర్ణాల చెరువు గట్టు
-- నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న రొట్టెల పండుగను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా అధికారులు.
-- కేవలం మూడు రోజులు మాత్రమే పండుగ నిర్వహణకు అనుమతి.
-- మొహర్రం నాడు గంధ కలశానికి 20 మందికే అనుమతి.
-- భారాషాహిద్ దర్గా ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకున్న పోలసులు.
- 28 Aug 2020 10:18 AM IST
East Godavari updates: చింతూరు, మోతుగూడెం వద్ద గంజాయి పట్టివేత..ముగ్గురు వ్యక్తులు అరెస్ట్...
తూర్పుగోదావరి జిల్లా....
-చింతూరు లో కారులో తరలిస్తున్న 160 కేజీలు, మోతుగూడెం వద్ద మరో కారులో తరలిస్తున్న125 కేజీల గంజాయి పట్టివేత..
-ముగ్గురు వ్యక్తులు అరెస్ట్...
-సీలేరు నుండి హైదరాబాద్ తరలిస్తుండగా తనిఖీలలో పట్టుకున్న చింతూరు పోలీసులు..
- 28 Aug 2020 10:05 AM IST
Amaravati updates: ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
అమరావతి...
-ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
-విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు..
-ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు.
-బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు.
-నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.
- 28 Aug 2020 10:00 AM IST
East Godavari district updates: కాకినాడ పోర్టు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా అనే వ్యక్తి..
తూర్పుగోదావరి జిల్లా....
-కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడినంటూ వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా అనే వ్యక్తి..
-పోర్టులో కాలం చెల్లిన ఏడు వెసెల్స్ ను వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన కరీముల్లా..
-వేలంలో కొనుగోలు చేసిన వెసల్స్ ను తరలించేందుకు అనుమతుల కోసం రూ. 35 లక్షలు ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్ చేసిన కరీముల్లా..
-ఎమ్మెల్యే ద్వారంపూడి కి కరీముల్లా కి ఎటువంటి సంబంధం లేదని తేలడంతో కరీముల్లా పై కేసు నమోదు చేసిన పోర్టు పోలీసులు..
- 28 Aug 2020 9:44 AM IST
Kadapa-Gandikota Reservoir updates: గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు...
కడప :
-గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు...
-అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కుల నీరు రాక
-గండికోట జలాశయంలో 7 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ...
-గండికోటలొ నీరు పెరగడంతొ పైడిపాళెం జలాశయానికి 330 క్యూసెక్కులు, సీబీఆర్‌కు 500 క్యూసెక్కుల నీటిని తరలింపు
- 28 Aug 2020 9:34 AM IST
Kadapa updates: విధుల్లో అలసత్వం చూపిన సిబ్బందిపై కడప డ్వామా పిడి యధుభూషణ్ రెడ్డి కొరడ...
కడప :
-విధుల్లో అలసత్వం చూపిన సిబ్బందిపై కడప డ్వామా పిడి యధుభూషణ్ రెడ్డి కొరడ...
-ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో నిబంధల ప్రకారం పనిచేయకపొవడం, కూలీలకు ఉపాధి పనుల కల్పనలొ వెనకపడటంపై అగ్రహం...
-14 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్‌తోపాటు
-ఏపీవో, ఈసీలపై సస్పెన్షన్ వేటు
- 28 Aug 2020 8:10 AM IST
Sri Ram Sagar Project updates: నిజామాబాద్ -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
-నిజామాబాద్ -శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద
-ఇన్ ఫ్లో 14 వేల క్యుసెక్కులు
-ఔట్ ఫ్లో 4568 క్యూసెక్కుల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
-ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులు
-నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
-ప్రస్తుతం 80 టిఎంసీలు



