Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 28 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం దశమి (ఉ. 10-59 వరకు) తదుపరి ఏకాదశి, మూల నక్షత్రం (మ. 3-46 వరకు) తదుపరి పూర్వాషాఢ, అమృత ఘడియలు (ఉ. 9-35 నుంచి 11-07 వరకు) వర్జ్యం (మ. 2-14 నుంచి 3-46 వరకు తిరిగి రాత్రి 1-12 నుంచి 2-46 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-26 నుంచి 1-16 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-16
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Aug 2020 7:58 AM IST
Bangalore riots updates: బెంగళూరు విధ్వంశం పై న్యాయవిచారణ
-కర్ణాటక: బెంగళూరు నగర శివారులో దేవర జీవన హళ్ళి, కాడు గొండనహళ్లి పరిధిలో జరిగిన విధ్వంసం పై న్యాయ విచారణ
-జిల్లా అధికారి శివమూర్తి ఘటన జరిగిన రెండు ప్రాంతాల్లో పర్యటన
-విధ్వంసం జరిగిన ప్రాంతాల్లో కాలిపోయిన బైకులు, పోలీస్ స్టేషన్ల లో జరిగిన నష్టాలను అంచనా వేసిన అధికారులు.
-మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 11న రాత్రి 7 నుంచి వేకువజామున నాలుగు గంటల వరకూ జరిగిన అన్ని ఘటనలపైన విచారణ చేయనున్న జిల్లా అధికారి.
-సెప్టెంబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తామని వెల్లడి
-మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న విచారణాధికారి
- 28 Aug 2020 7:51 AM IST
Visakhapatnam updates: నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
విశాఖ..
-నేడు వైసీపీలో చేరనున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
-మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం జగన్ సమక్షంలో చేరనున్న రమేష్ బాబు
-2009 పెందుర్తి, 2014 యలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు..
-టీడీపీ విశాఖ రూరల్ అధ్యక్షుడు గా పని చేసిన పంచకర్ల ఇటీవల పార్టీ కి దూరంగా వుంటూ..నేడు వైసీపీ లో చేరుతున్నారు.
- 28 Aug 2020 7:47 AM IST
Visakhapatnam weather updates: ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం...
విశాఖ..
-వెదర్ అప్ డేట్
-ఉత్తర చత్తీస్గఢ్ మీదుగా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....
-మూడురోజుల్లో మధ్యప్రదేశ్ మీదుగా పయనించి బలహీన పడుతుంది..
-రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి..
-ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర లో తేలికపాటి వర్షాలు
- 28 Aug 2020 7:40 AM IST
Srisailam project updates: జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి..
కర్నూలు జిల్లా....
-శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ఉదృతి
-6 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
-ఇన్ ఫ్లో : 1,27,342 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 2,35,071 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 884.60 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 213.4011 టీఎంసీలు
-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 28 Aug 2020 7:34 AM IST
Anantapur updates: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం
అనంతపురం..
అనంతపురం: నేడు వ్యవసాయ సలహా మండలి సమావేశం
కలెక్టర్ గంధం చంద్రుడు అధ్యక్షతన జరగనున్న సమావేశానికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు
ఖరీఫ్ పంటల సాగు, పంట పరిస్థితులు, రబీలో సాగు తదితర అంశాలపై కార్యచరణ ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం
- 28 Aug 2020 7:17 AM IST
Anantapur updates: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్..
అనంతపురం..
-అనంతపురం: పోలీస్ కస్టడీకి కానిస్టేబుల్ వెంకట రమేష్.
-కార్లను అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన విషయం లో వెంకట రమేష్ నిందితుడు.
-నిందితుడిపై పుట్లూరు, అనంతపురం రెండో పట్టణ పోలీసు స్టేషన్ల లో కేసులు నమోదు
- 28 Aug 2020 7:09 AM IST
Anantapur updates: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.
అనంతపురం..
-అనంతపురం: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ.
-అనంతపురం జిల్లా నుంచి కర్ణాటక లోని బెంగళూరు ఇతర పట్టణాలకు ఆర్టీసీ బస్సుల కొనసాగింపు.
-లాక్ డౌన్ సమయం లో రెండు రాష్ట్రాలకు నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరణ
- 28 Aug 2020 7:04 AM IST
Ananthapur updates: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.
అనంతపురం...
-అనంతపురం: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.
-ఢిల్లీకి చెందిన ఎక్స్ప్రెస్ ఇండియా గ్రూప్ సంస్థ ఆన్లైన్లో అవార్డు అందజేత.
-సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి హై అలర్ట్ అప్లికేషన్ యాప్ ను రూపొందించేందుకు ఎస్పీకి అవార్డు ప్రధానం.
- 28 Aug 2020 6:47 AM IST
Vijayawada health updates: విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు
విజయవాడ...
-విజయవాడలోని కోవిడ్ కమాండ్ సెంటర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు
-వైద్య ఆరోగ్య శాఖామంత్రి, ఆళ్ళ నాని
-కరోనా మహమ్మారిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘మాస్కే కవచం’
-నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం
-కోవిడ్ మహమ్మారిని అంతం చేయడమే ‘మాస్కే కవచం’ ముఖ్య ఉద్దేశం
-ఉపయోగించిన మాస్కుల్ని మూడురోజులపాటు మూసిన కవర్లో ఉంచి పారవేయాలి
-ఇలా చేస్తే ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందదు
-ఇళ్లల్లో వయసు మీరిన వారికి కోవిడ్ రాకుండా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
-బయటికి వెళ్లినప్పుడు యువత తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి
-నెల రోజుల విస్తృత ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలి




