Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Balasubrahmanyam: ఎస్ పి బాలసుబ్రమణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: ఆదిమూలపు సురేష్!
    25 Sep 2020 9:55 AM GMT

    Balasubrahmanyam: ఎస్ పి బాలసుబ్రమణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: ఆదిమూలపు సురేష్!

    అమరావతి..

    -గానగంధర్వుడు బాలు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.

    -సంగీత ప్రపంచంలో బాలు ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది.

    -కళాభిమానుల గుండెల్లో బాలు చిరస్తాయి గా నిలిచిపోతారు.

    -బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి సురేష్.

  • 25 Sep 2020 9:52 AM GMT

    Balasubrahmanyam: చెన్నైలోని బాలసుబ్రహ్మణ్యం ఇంటికి బాలు పార్థివ దేహం..

    సినిమా పిఆర్ఓ నిఖిల్ క్రిష్ణ..

    -సాయంత్రం 4గంటలకు ఇంటికి తరళింపు

    -ఆయన అంతిమ సంస్కారాలు రెడ్ హిల్స్ సమీపంలోని ఫామ్ హౌస్ లో చేయాలని నిర్ణయించారు.

    -అంతిమ సంస్కారాలు రాత్రికి చేయాలా ఉదయం చేయాలా అన్నది వెంటనే ప్రకటిస్తాం


  • Balasubrahmanyam: శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది..
    25 Sep 2020 9:46 AM GMT

    Balasubrahmanyam: శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది..

    వెంకయ్యనాయుడు..ఉపరాష్ట్రపతి..

    -ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు   అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.

    -వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

  • 25 Sep 2020 9:37 AM GMT

    Kakinada updates: గానగంధర్వుడు బాలు మరణంతో విషాదంలో గంగాధం మాస్టారు కుటుంబసభ్యులు..

    తూర్పుగోదావరి :

    కాకినాడ:

    -హెచ్ఎంటివి తో గంగాధరం మాస్టార్ కుమారుడు పెద్దిరెడ్డి సతీష్,.

    -నెల్లూరు లోని కొందరు స్నేహితుల ద్వారా నాన్న గారికి బాలు గారు పరిచయం..

    -వారి స్నేహానికి సంగీత కారణం.. కాకినాడలో నాటకరంగ పై ఏర్పాటు చేసిన మంజుల ఆర్ట్స్ అభివృధ్ధికి బాలు ఎంతో కృషి చేశారు..

    -మంజుల ఆర్ట్స్ కి బాలు కార్యదర్శిగా వ్యవహరించారు.. మైమ్ షో లకు నాన్నగారు సంగీతం అందించేవారు..

    -గంగాధం ఆర్కెస్ట్రా ప్రతీ కార్యక్రమానికి బాలు వచ్చారు.. ఆయన కోలుకుని తిరగి వస్తారని భావించాం..

  • Balasubrahmanyam: గాన‌గంధ‌ర్వుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపం..నారా లోకేష్!
    25 Sep 2020 9:29 AM GMT

    Balasubrahmanyam: గాన‌గంధ‌ర్వుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సంతాపం..నారా లోకేష్!

    అమరావతి..

    టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..

    -ఆబాల గోపాలాన్ని త‌న గానంతో అల‌రించిన ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూయ‌డం.. సంగీత‌, సాహిత్య, సినీ, క‌ళా ప్ర‌పంచానికి తీర‌నిలోటు.

    -ద‌శాబ్దాలుగా భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ 40 వేల‌కు పైగా పాట‌లు పాడిన సుస్వ‌రాల సుమ‌ధుర బాలు మ‌న‌మ‌ధ్య‌ లేక‌పోవ‌చ్చు.

    -ఆయ‌న పాట‌, మాట‌, బాట‌, న‌ట‌న‌, సంగీతం అన్నీ చిర‌కాలం జీవించే ఉంటాయి.

  • 25 Sep 2020 9:22 AM GMT

    Balasubrhmanyam: దేశం గర్వించే మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం!

    తూర్పుగోదావరి.. కొత్తపేట...

    శిల్పి ఒడియార్ రాజకుమార్ కామెంట్..

    -ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నాను.

    -ఆయన మనసు మెచ్చిన రీతిలో వారి తల్లిదండ్రుల విగ్రహాలను తీర్చిదిద్దా..

    -తనకు విగ్రహాన్ని తీర్చిదిద్దాలని కోరిన బాలు..

    -40 వేలకు పైగా పాటలు పాడిన మధుర గాయకుడు బాలు మరణం సంగీత లోకానికి ఎప్పటికీ తీరని లోటు..

  • Balasubrahmanyam: తెలుగు జాతి ముద్దుబిడ్డ బాల సుబ్రమణ్యం: చంద్రబాబు!
    25 Sep 2020 9:15 AM GMT

    Balasubrahmanyam: తెలుగు జాతి ముద్దుబిడ్డ బాల సుబ్రమణ్యం: చంద్రబాబు!

    అమరావతి..

    -మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం..

    -తన గానంతో ప్రజల గుండెల్లో అజరామరుడు.

    -గాన గంధర్వుడు తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎస్ పి బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    -బాల సుబ్రమణ్యం మృతి భారత చలన చిత్ర పరిశ్రమకే కాదు, కళాకారులు అందరికీ, యావత్ సంగీత ప్రపంచానికే తీరనిలోటు.

    -16భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతములకు వ్యాప్తి చేశారు..

    -ఆయన కోలుకుంటారు, ఆరోగ్యంతో తిరిగి వస్తారు, మళ్లీ తన పాటలతో పరవశింపచేస్తారని అందరూ గంపెడాశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన మృతి   వార్త ఆశనిపాతమైంది.

    -గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రోతలపై, ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు.

    -పద్మశ్రీ, పద్మభూషణ్ తోపాటు ఆయన సాధించిన అనేక జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులే బాలసుబ్రమణ్యం ప్రతిభకు కొలమానాలు.

    -భౌతికంగా బాల సుబ్రమణ్యం మనకు దూరం అయినా, తన పాటల్లో ప్రజల గుండెల్లో అజరామరుడుగా నిలిచిపోయారు.

    -ఎందరో వర్తమాన గాయకులకు మార్గదర్శి. కళాకారులు అందరికీ స్ఫూర్తిదాయకుడు.

    -తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆయన పాటలు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం, ఉత్సాహం పరవళ్లు తొక్కేది.

    -ఎస్ పి బాల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

  • 25 Sep 2020 9:09 AM GMT

    S.P.Balasubrahmanyam: 'సింహపురి'లో జన్మించిన గాయకులు..ప్రపంచం గర్వించదగ్గ గానగంధర్వులు..

    అమరావతి..

    మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

    -"నేనున్నది మీలోనే..ఆ నేను మీరేలే..నాదన్నది ఏమున్నది నాలో" అంటూ వెళ్లిపోయారా బాలుగారూ

    -ఏడ్చినా..నవ్వినా..మాటాడినా..పాటాడినా..ఏదైనా బాలుగారి నోట..ప్రతీది పాటే

  • Balasubrahmanyam: ఎస్పీ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు: అవంతి శ్రీనివాసరావు!
    25 Sep 2020 9:06 AM GMT

    Balasubrahmanyam: ఎస్పీ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు: అవంతి శ్రీనివాసరావు!

    విశాఖ..

    మంత్రి అవంతి శ్రీనివాసరావు సంతాపం

    -ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు

    -మారుమూల శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రజలతో ఎస్పీ మమేకమైన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి

  • Vijayawada-Rajbhavan: గాణ గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్!
    25 Sep 2020 8:47 AM GMT

    Vijayawada-Rajbhavan: గాణ గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్!

    విజయవాడ రాజ్ భవన్:

    -గాణ గంధర్వుడు పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ప్రఖ్యాత గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్     గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్.

    -16 బాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గవర్నర్ తెలిపారు.

    -వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్.

Print Article
Next Story
More Stories