Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • S.P.B.: గాన గంధర్వుడు ఎస్పీ బాలు చనిపోవడం బాధాకరం: రఘురామకృష్ణ రాజు!
    25 Sep 2020 8:28 AM GMT

    S.P.B.: గాన గంధర్వుడు ఎస్పీ బాలు చనిపోవడం బాధాకరం: రఘురామకృష్ణ రాజు!

    రఘురామకృష్ణ రాజు..వైసిపి ఎంపీ..

    -గొప్ప గాయకుడుని భారత దేశం కోల్పోవడం దురదృష్టకరం

    -ఎస్పీ బాలుతో మంచి పరిచయం ఉంది..

    -బాలు లేని లోటు తీర్చలేనిది

    -వివిధ భాషల నుంచి రత్నల్లాంటి గాయకులను అందించారు

    -ఎస్పీ బాలు ఆత్మకు శాంతి కలాగాలని కోరుకుంటున్నా

    -బాలు కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా

  • East Godavari-Rajahmundry: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొత్త దివ్వ రధం తయారీకి ఈనెల 27న ముహూర్తం నిర్ణయం..
    25 Sep 2020 8:08 AM GMT

    East Godavari-Rajahmundry: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొత్త దివ్వ రధం తయారీకి ఈనెల 27న ముహూర్తం నిర్ణయం..

    తూర్పుగోదావరి -రాజమండ్రి -రాజోలు..

    -ఉదయం 11.15 గంటలకు రధం తయారు చేయడానికి పనులు ప్రారంభిస్తారు

    -ఆరోజు ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన శాంతి హోమం చేసి రధం తయారీ పనులు,

    -ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడం కోసమే సుదర్శన శాంతి హోమం చేయడానికి దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు

  • Amaravati updates: గుంటూరు దళిత శ్మశాన వాటిక విధ్వంసంపై టీడీపీ నిజ నిర్థారణ కమిటీ..
    25 Sep 2020 8:02 AM GMT

    Amaravati updates: గుంటూరు దళిత శ్మశాన వాటిక విధ్వంసంపై టీడీపీ నిజ నిర్థారణ కమిటీ..

    అమరావతి..

    -కె. కళా వెంకటరావు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు..

    -గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత శ్మశాన వాటికలో జరిగిన విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు   ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటి ఏర్పాటు చేయడం జరిగింది.

    -ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజు లు ఉన్నారు.

    -గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దళిత స్మశాన వాటికలో 171 సమాదులను శ్మశాన వాటిక ఆధునీకరణ పేరుతో తొలగించడం దుర్మార్గం.

    -దళితుల అంగీకారం అనుమతి లేకుండా శ్మశాన వాటికలో ఏ విధంగా పనులు మొదలు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

    -దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

    -జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయి.

    -విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చి దళితులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.

    -దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

  • Visakha updates: మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు..
    25 Sep 2020 7:09 AM GMT

    Visakha updates: మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు..

    విశాఖ..

    -చింతపల్లి ,గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు..

    -ప్రతి వ్యక్తిని క్షుణ్నంగా పరిశీలించి విడిచి పెడుతున్న పోలీసులు..

    -మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు బలగాలు తో అడుగడుగునా గాలింపు చర్యలు..

    -దీంతో గిరిజన ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన..

  • Kadapa District updates: హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...
    25 Sep 2020 7:05 AM GMT

    Kadapa District updates: హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...

    కడప :

    -పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కామెంట్స్

    -జీవో 776 సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు...

    -హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది కి ఏపీ హోం శాఖ మంత్రికి, డీజీపీకి ఇకపై ఇలా వ్యవహరించవద్దని సలహా ఇవ్వమని తెలిపింది...

    -గతంలో ఉమ్మడి రాష్ట్ర సిఎంలు నైతిక విలువలు పాటించి నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు..

    -ప్రస్తుతం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు గత సిఎంలపై చేసిన వ్యాఖ్యల కంటే 100 రెట్లు తీవ్ర మైనవి...

    -ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా సిఎం వెంటనే రాజీనామా చేయాలి

  • Tirumala updates: కోవిడ్ వ్యాప్తి నియంత్రణను పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం..
    25 Sep 2020 7:01 AM GMT

    Tirumala updates: కోవిడ్ వ్యాప్తి నియంత్రణను పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం..

    తిరుమల :

    వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఛైర్మన్..

    -కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణను పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం..

    -గత పాలకమండలి సమావేశంలో నిర్ణయించిన విధంగా హిందు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ఆలయాల్లో గుడికి ఒక గోమాత     కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..

    -బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం వచ్చే అక్టోబర్ లో దక్షిణ భారత దేశంలోని 4 రాష్ట్రాల్లోని 27 ఆలయాల్లో గుడికి ఒక గోమాత కార్యక్రమం నిర్వహిస్తాం..

    -గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని స్వామివారి ప్రార్థిస్తున్నా..

    -స్వామి వారిపైన ఎన్నో గీతాలను బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు..

  • Vijayawada updates: రైతాంగ వ్యతిరేక బిజెపి కార్పొరేట్లకు రైతాంగాన్ని ధారాదత్తం చేస్తోంది...
    25 Sep 2020 6:57 AM GMT

    Vijayawada updates: రైతాంగ వ్యతిరేక బిజెపి కార్పొరేట్లకు రైతాంగాన్ని ధారాదత్తం చేస్తోంది...

    విజయవాడ..

    -మధు....సీపీఎం రాష్ట్ర కార్యదర్శి..

    -రైతాంగం బీజేపీపై పోరులో పెద్ద ఎత్హున పాల్గొనాలి

    -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి..

    -నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది

    -శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతాంగాన్ని పోలీసులు అరెస్ట్ లతో అడ్డుకోవడం సరికాదు

    -వడ్డే శోభనాధీశ్వర రావు, అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ అధ్యక్షుడు

    -కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలి

    -తన తండ్రి తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకానికి జిఓ నెంబర్ 22 తూట్లు పోడుస్తోంది

    -సీఎం జగన్ తీసుకొచ్చిన జిఓ నెంబర్ 22ను వెనక్కు తీసుకోవాలి

  • Vijayawada updates: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నిరసన..
    25 Sep 2020 6:52 AM GMT

    Vijayawada updates: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల నిరసన..

    విజయవాడ...

    -మద్దతు ప్రకటించిన లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు

    -సిపిఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ క్యాంపు కార్యాలయంకు ర్యాలీగా బయలుదేరిన నేతలు

    -నారాయణ, రామకృష్ణ, సీపీఎం నేతలు మధు, రైతు నాయకుడు వడ్డే శోభనాధీశ్వర రావుల అరెస్డ్

    -రోడ్డుపై బైఠాయించిన మహిళ కార్యకర్తలు...తీవ్ర పెనుగులాట

    -నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి..

    -రైతులను బానిసలుగా మార్చే బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది

    -పోలీసులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు

    -సీఎం జగన్, చంద్రబాబు లు మోడీకి బానిసలైపోయారు

    -రైతాంగ సమస్యల వైపు ఉంటారో లేదో జగన్, చంద్రబాబులు తేల్చుకోవాలి

  • 25 Sep 2020 6:24 AM GMT

    Krishna updates: శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో పురుషుని మృతదేహం..

    కృష్ణాజిల్లా..

    -లభించిన ఎన్ఎంయూ ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మృతదేహం

    ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద కృష్ణానదిలో పురుషుని మృతదేహం..

    -విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద పూజలు చేస్తూ కృష్ణానదిలో దూకిన దుర్గాప్రసాద్ గా గుర్తింపు

    -దుర్గాప్రసాద్ బంధువులకు సమాచారం అందించిన పోలీసులు

  • Srikakulam updates: వజ్రపుకొత్తూరు - అనకాపల్లి గ్రామ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అప్పలరాజు..
    25 Sep 2020 6:21 AM GMT

    Srikakulam updates: వజ్రపుకొత్తూరు - అనకాపల్లి గ్రామ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అప్పలరాజు..

    శ్రీకాకుళం జిల్లా..

    -వజ్రపుకొత్తూరు మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు..

    -వైఎస్సార్ ఆసరాతో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దుకాణం ప్రారంభించిన మంత్రి అప్పలరాజు..

Print Article
Next Story
More Stories