Top
logo

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధగా ఉంది: బాలకృష్ణ హిందూపురం mla!
  25 Sep 2020 12:41 PM GMT

  Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధగా ఉంది: బాలకృష్ణ హిందూపురం mla!

  అమరావతి..

  -ఎస్పీబీ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరని లోటు

  -తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమించారన్న వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది.

  -ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ప్రతిరోజూ ఆ లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేశాను.

  -కానీ ఇంతలోనే బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.

  -ఎస్పీ బాలసుబ్రమణ్యంతో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.

  -నాన్నగారు నటించిన ఎన్నో చిత్రాల్లో ఆయన సుమధుర గానం అందించారు.

  -చిత్రం భళారే విచిత్రం అంటూ గంభీరమైన స్వరంతో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది.

  -ఎస్పీబీ మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.

  -బాల సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  -ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

 • Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం గారికి హృదయంతో నా కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను: ఆళ్ల నాని!
  25 Sep 2020 12:34 PM GMT

  Balasubrahmanyam: బాల సుబ్రహ్మణ్యం గారికి హృదయంతో నా కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను: ఆళ్ల నాని!

  పశ్చిమగోదావరి జిల్లా..ఏలూరు..

  రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని...

  -సంగీత దర్శుకుడు, నటుడు, ప్రపంచం గర్వించదగ్గ పండితా రాడ్యు లు, గాన గంధర్యులు బాల సుబ్రహ్మణ్యం....

  -మావూరు మణి..అని ముద్దుగా పిలవమనే గానగంధర్వుడు...ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు,నటుడు,.ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతికి తీవ్ర     విచారం.

  -బహుముఖ ప్రజ్ఞాశాలి,భారతీయ సంగీత చరిత్రలో ఒక మైలు రాయిలా నిలిచిన మన బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే మాట నమ్మలేకున్నాను

  -భారతీయ చలనచిత్ర రంగంలో తనదంటూ ప్రత్యేక శైలి ఏర్పాటు చేసుకొని సుమారు 40 వేల పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకున్నా ఆయన   పాడిన పాటలలో ఆయన మనతో జీవించి వుంటారు.

  -ఆయన ఆత్మకు శాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో నిబ్బరం కలిగించాలని కోరుకుంటున్నాను...

  -సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా... పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నూతన గాయకులను పరిచయం     చేసాడు...

  -బాల సుబ్రహ్మణ్యంకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మ శ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు...

  -ఏడ్చినా.. నవ్వినా.. నీరసపడినా.. ఉత్సాహం నిండినా.. స్ఫూర్తి పొందినా.. ప్రతి ఒక్క సందర్బా నికి ఆయన పాట ఒకటుందన్నారు.

  -గాయకునిగా, వ్యాఖ్యతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాల సుబ్రహ్మణ్యం కారణ జన్ములుగా అభివర్నించిన మంత్రి ఆళ్ల నాని.

 • 25 Sep 2020 12:10 PM GMT

  Balasubrahmanyam: నాన్న గారితో బాల సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అనుబంధం ఉంది...పెద్దిరెడ్డి సతీష్..

  తూర్పుగోదావరి... కాకినాడ...

  -ఆయన మృతి కాకినాడ నగరానికి, కళాకారులకు, సంగీత అభిమానులకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.

  -ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిన ప్పటికీ.. దేశమంతా ఆయన కుటుంబం తోనే ఉంటుంది..

  -ఆర్కెస్ట్రా పితామహుడు గంగాధర మాస్టర్ తనయుడు ..... పెద్దిరెడ్డి సతీష్.

 • Balasubrahmanyam: బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను: కళా వెంకట్రావ్!
  25 Sep 2020 11:38 AM GMT

  Balasubrahmanyam: బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను: కళా వెంకట్రావ్!

  అమరావతి..

  కళా వెంకట్రావ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

  -ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర విచారకరం

  -ఎస్పీబీ మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది

  -బాలు మృతి భారతీయ సినీ లోకానికి తీరని లోటు

 • Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది: రోజా!
  25 Sep 2020 11:29 AM GMT

  Balasubrahmanyam: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది: రోజా!

  సినీనటి, రోజా..

  -గాన గంధర్వుడు, తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, మా శ్రేయోభిలాషి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి మృతి నన్ను కలిచివేసింది.

  -మా నాన్నగారి స్నేహితుడిగా చిన్నప్పటినుండి మా కుటుంబానికి ఆయన ఆత్మీయులే.

  -వారు లేరన్న నిజం నమ్మడం కష్టంగా ఉంది.

  -వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

 • Balasubrahmanyam: పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్.పీ బాలు: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి!
  25 Sep 2020 10:45 AM GMT

  Balasubrahmanyam: పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్.పీ బాలు: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి!

  విజ‌య‌వాడ‌..

  -పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్.పీ బాలు లేని లోటు మరే గాయకులు పూడ్చలేనిది వారి మరణం బాధాకరం- దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి   శ్రీ‌నివాస‌రావు.

  -మాట్లాడినా..పాట పాడిన తెలుగు భాష, తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునే బాలసుబ్రమణ్యం భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా     ఉంటారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంతో వారికి ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.

  -గానగంధర్వుడు బాలు మృతి పట్ల సంతాపం వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు...

 • 25 Sep 2020 10:21 AM GMT

  Balasubrahmanyam: ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తాను. ఓం శాంతి!

  జీవీఎల్ నరసింహారావు , బిజెపి రాజ్యసభ సభ్యులు..

  -పుట్టిన దగ్గరనుంచి ప్రతి రోజూ విన్న ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారి అమృత కంఠం మూగబోయింది.

  -ఆయన పాటను పాడని, కనీసం హమ్ చేయని తెలుగు వాడు ఉండడు.

  -నింగికి ఎగిన బాలు గారు భగవంతుడిని, దేవతలను తన గాన మాధుర్యంతో ఇక అలరించనున్నారు.

 • Balasubrahmanyam: కోట్లాది భారతీయుల అభిమాన గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం విచారకరం..
  25 Sep 2020 10:14 AM GMT

  Balasubrahmanyam: కోట్లాది భారతీయుల అభిమాన గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం విచారకరం..

  అమరావతి..

  సుజనాచౌదరి రాజ్యసభ సభ్యులు..

  -గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా సినీరంగానికి ఎనలేని సేవలందించిన బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటు తీర్చలేనిది.

  -వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

 • Balasubrahmanyam: సంగీతమే ఊపిరిగా బాలు జీవించారు: స్వరూపానందేంద్ర!
  25 Sep 2020 10:05 AM GMT

  Balasubrahmanyam: సంగీతమే ఊపిరిగా బాలు జీవించారు: స్వరూపానందేంద్ర!

  విశాఖ..

  -ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సంతాప సందేశం

  -ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివైక్యం పొందడం బాధాకరం

  -బాలు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటు

  -విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది

  -శ్రీశైలం వెళితే శారదాపీఠం ఆశ్రమంలోనే ఉండేవారుగొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం బాలసుబ్రహ్మణ్యం

  -బాలు ఆత్మ భగవంతుని పాద చరణముల వద్దకు చేరాలని కోరుకుంటున్నా - స్వరూపానందేంద్ర

 • Balasubrahmanyam: Sp బాల సుబ్రహ్మణ్యం మృతి కి సంతాపం: కొడాలి నాని!
  25 Sep 2020 10:02 AM GMT

  Balasubrahmanyam: Sp బాల సుబ్రహ్మణ్యం మృతి కి సంతాపం: కొడాలి నాని!

  కృష్ణా జిల్లా..

  -గాన గంధర్వుడు Sp బాల సుబ్రహ్మణ్యం మృతి కి సంతాపం తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

  -సిని పరిశ్రమలో 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన   రికార్డు సృష్టించారు

  -గానగంధర్వుడు S.P బాల సుబ్రమణ్యం గారికి ఘన నివాళులు ,వారి పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ,వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనో దైర్యం   ప్రసాదించాలి

Next Story